AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: చంపేది మొసలా? సైకో కిల్లరా? ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఒక ప్రాంతంలో వరుసగా హత్యలు జరుగుతాయి. అయితే మొసలే మనుషులను తినేస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకు తగ్గట్టుగానే నది ఒడ్డున మనుషుల శరీర భాగాలు కుప్పులు తెప్పలుగా దొరుకుతాయి అయితే అసలు నిజం వేరే ఉంటుంది. మొసలి పేరు చెప్పుకొని ఒక సైకో కిల్లర్..

OTT Movie: చంపేది మొసలా? సైకో కిల్లరా? ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 11, 2026 | 10:15 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా హిట్టయిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఈ మధ్యన కన్నడలోనూ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. తెలుగు తదితర భాషల్లోనూ వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అయ్యన మానే’, ‘శోధ’, ‘మారిగల్లు’ వంటి కన్నడ వెబ్ సిరీస్ లకు ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించే.  ఇందులో క్రైమ్ ఎలిమెంట్స్ మెయిన్ అయినప్పటికీ కుల వివక్ష వంటి సామాజిక అంశాలను టచ్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ వెబ్ సిరీస్ కు రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఈ సిరీస్ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.. ఒక ప్రాంతంలో మనుషులను తినే మొసలి తిరుగుతుందనే భయం అక్కడి ప్రజల్లో ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఒక పండగ సమయంలో నది ఒడ్డున ఒక మనిషుల శరీర భాగాలు దొరుకుతాయి. దీంతో అందరూ ఇది మొసలి పనే అని భావిస్తారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది.  పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో సగం మంది కనిపించకుండా పోయిన వారే ఉండటం పోలీసులను కలవరపెడుతుంది.  మరి వీరంతా ఏమయ్యారు? అసలు ఆనవాళ్లు లేకుండా ఎలా మాయమయ్యారు? ఇది నిజంగా మొసలి దాడివల్ల జరుగుతుందా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? మరి పోలీసులు ఈ క్రైమ్ మిస్టరీని ఎలా ఛేదించారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

2022లో వచ్చిన సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్ ‘విలంగు’ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  హిందీలో కూడా ఇది ‘జానవర్’ పేరుతో  ఇది రీమేక్ అయ్యింది. ఇప్పుడు కన్నడలో ‘రాక్షస’గా వస్తోంది.  మరి ఒరిజినల్ కథను అలాగే ఉంచారా? లేదా ఏమైనా మార్పులు చేశారా అనేది ఫిబ్రవరి 20న తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

రాక్షస వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..