క్యాన్సర్ రూట్స్ ని అంతం చేసే ఖతర్నాక్‌ జ్యూస్‌..!

11 February 2026

Jyothi Gadda

బీట్రూట్‌ ఒక రకమైన కూరగాయ. ఇది తీపి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ కూరగాయ జ్యూస్ అధిక పోషకాలను అందిస్తుంది.

బీట్రూట్‌లో ఉండే నైట్రేట్‌లు రక్తనాళాలను విశాలం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి మంచిది.

బీట్రూట్‌ జ్యూస్‌, కండరాలకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. దీని వల్ల శారీరక శ్రమ సమయంలో కండరాలు త్వరగా అలసిపోకుండా ఉంటాయి.

బీట్రూట్‌లో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

బీట్రూట్‌లో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తాయి.  

ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ, కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు. దీనిలోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్ళ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు.

బీట్రూట్‌లో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వ్యాయామం చేసే ముందు తీసుకుంటే శారీరక శక్తి పెరుగుతుంది.

బీట్ రూట్‌లను శుభ్రంగా కడిగి, తోక్క తీసి ముక్కలుగా కోయాలి. ముక్కలు చేసిన బీట్ రూట్‌లు, నీరు, నిమ్మరసం, తేనెను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.