పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

Ravi Kiran

|

Updated on: Jul 03, 2024 | 9:52 PM

అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి వెళ్లారు పవన్ కల్యాణ్. ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో జరిగిన వారాహి బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని..

అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి వెళ్లారు పవన్ కల్యాణ్. ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో జరిగిన వారాహి బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. తాను కోరుకోని డిప్యూటీ సీఎం పదవి వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నానని.. తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారానని పవన్ కళ్యాణ్ అన్నారు.

పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయం.. దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు పవన్‌. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్‌ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదన్నారు పవన్ కల్యాణ్. ఎంతో ధైర్యం, బలం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు పవన్. పిఠాపురంలో సెరీకల్చర్‌ అభివృద్ధి.. గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తామన్నారు. నిస్వార్ధంగా, లంచాలకు తావులేకుండా పాలన సాగిస్తానని హామీనిచ్చారు. ఫైనల్‌గా పవన్‌ నియోజకవర్గంపై చూపించిన ప్రేమ ఆప్యాయతలకి జనం ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..