Watch Video: మంటల్లో డాక్యూమెంట్లు.. స్టేషన్లో నిందితులు.. అసలు కథ ఇదే..

Watch Video: మంటల్లో డాక్యూమెంట్లు.. స్టేషన్లో నిందితులు.. అసలు కథ ఇదే..

Srikar T

|

Updated on: Jul 04, 2024 | 9:10 AM

విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. యనమలకుదురుకట్ట మీద రికార్డులను తగలబెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాగరాజు, రామారావులను పెనమలూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి అనేక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, లెటర్‌ హెడ్స్‌, క్యాసెట్‌లు దగ్ధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్‌, పొల్యూషన్‌ శాఖలవిగా గుర్తించారు. డాక్యుమెంట్స్‌ను ఎందుకు తగలబెట్టారని అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధం కేసులో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. యనమలకుదురుకట్ట మీద రికార్డులను తగలబెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాగరాజు, రామారావులను పెనమలూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి అనేక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, లెటర్‌ హెడ్స్‌, క్యాసెట్‌లు దగ్ధం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్‌, పొల్యూషన్‌ శాఖలవిగా గుర్తించారు. డాక్యుమెంట్స్‌ను ఎందుకు తగలబెట్టారని అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ సమీర్‌ శర్మ ఆదేశాలతోనే తాము వీటిని తగలబెట్టినట్లు డ్రైవర్‌ నాగరాజు చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా తగలబెట్టిన కొన్ని పత్రాలపై నాటి మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలు, సమీర్ శర్మ ఫొటోలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు. ఇన్నోవాలో వీటిని ఎందుకు తెచ్చారు.. ఎక్కడి నుంచి తీసుకువచ్చి వీటిని తలగబెట్టాలనుకున్నారు అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లు పెనమలూరు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..