Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్ గుచ్చుకుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. మంచంపై ఆడుకుంటూ కిందపడటంతో రియాన్షిక చెవి పైభాగంలోపలికి పెన్ చొచ్చుకుపోయింది. దీంతో తీవ్ర తీవ్ర రక్తస్రావం అయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ను నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్‌లో పెన్ గుచ్చుకుని నాలుగు సంవత్సరాల రియాన్షిక మృతి చెందింది. తన ఇంట్లో మంచం మీద కూర్చొని బుక్స్‌లో రాసుకుంటూ ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కింద పడటంతో రియాన్షిక చెవి పైభాగం లోపలికి పెన్ను చొచ్చుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో పాపను ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. అక్కడి డాక్టర్లు సర్జరీ చేసి.. నాలుగు ఇంచెలు లోనికి చొచ్చుకెళ్లిన పెన్నును బయటకు తీశారు. సర్జరీ అనంతరం బ్రెయిన్‌కు ఇన్ఫెక్షన్ కావడంతో చిన్నారి రియాన్షిక ప్రాణాలొదిలింది. రియాన్షిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

