AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో

సికింద్రాబాద్ టూ గుంటూరు.. ప్రస్తుతం ఈ రూట్‌లో ప్రయాణం ఐదు నుంచి ఆరున్నర గంటల సమయం పడుతుంది. జన్మభూమి సూపర్‌ఫాస్ట్.. అలాగే గోల్కండ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు లాంటివి ఈ రూట్‌లో తిరుగుతున్నాయి. అలాగే తెల్లారుజామున పరుగులుపెట్టే ట్రైన్‌ అయితే..

AP News: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
Guntur
Ravi Kiran
|

Updated on: Jul 04, 2024 | 7:49 PM

Share

సికింద్రాబాద్ టూ గుంటూరు.. ప్రస్తుతం ఈ రూట్‌లో ప్రయాణం ఐదు నుంచి ఆరున్నర గంటల సమయం పడుతుంది. జన్మభూమి సూపర్‌ఫాస్ట్.. అలాగే గోల్కండ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు లాంటివి ఈ రూట్‌లో తిరుగుతున్నాయి. అలాగే తెల్లారుజామున పరుగులుపెట్టే ట్రైన్‌ అయితే 4 గంటల సమయం పడుతుంది. త్వరలోనే ఈ ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. సికింద్రాబాద్-గుంటూరు రూట్‌లో నల్లపాడు-బీబీనగర్ మధ్య 248 కిమీ మేర 2వ రైల్వే లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పట్టాలెక్కాయి. సుమారు రూ. 2853 కోట్ల ఈ ప్రాజెక్టును 4 దశల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగష్టులో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే 3 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోనున్నాయి రైళ్లు. ఈ రూట్ మధ్య ప్రస్తుతం సింగిల్ రైల్వే లైన్ ఉండటం వల్ల ఒక రైలు వస్తుంటే.. మరొకటి స్టేషన్‌లో ఆగాల్సిన పరిస్థితి వస్తోంది.

నల్లపాడు-బీబీనగర్ రూట్ మధ్య ప్రస్తుతం గూడ్స్ రైళ్ల ద్వారా రైల్వేశాఖకు మాంచి సౌకర్యం లభిస్తోంది. బొగ్గు, సిమెంట్ రవాణాతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా తోడవ్వడంతో ఆదాయం రెట్టింపు అవుతోంది. ఈ రూట్‌లో రెండో లైన్ వస్తే.. రామాపురం, జగ్గయ్యపేట, మేళ్లచెరువు, జాన్ పహాడ్, నడికుడి, విష్ణుపురం, నార్కెట్‌పల్లి, చిట్యాలలో ఉండే అన్ని పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది.

కాగా, సికింద్రాబాద్ టూ విజయవాడకు ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఖాజీపేట-ఖమ్మం లైన్, మరొకటి బీబీనగర్-నడికుడి రైల్వే లైన్. బీబీనగర్-నడికుడి-గుంటూరు మార్గంలో ప్రస్తుతం 148 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కొత్త రైల్వే లైన్‌ను 160 కిలోమీటర్ల వేగం తట్టుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ రూట్‌లో డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే.. ఇక సికింద్రాబాద్ టూ గుంటూరు రెండున్నర నుంచి మూడు గంటలు సమయం పట్టే ఛాన్స్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులౌట్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..