Pawan Kalyan: వారాహి దీక్షలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం.. సూర్యుడి విశిష్టతను తెలియజేస్తూ పవన్ ప్రత్యేక పూజలు
పవన్ కళ్యాణ్ గతంలో రోజూ సూర్య నమస్కారాలు చేసే వారు. అయితే గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించిన చిన్న ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీంతో సూర్య నమస్కారాలు చేయడానికి విరామం ఇచ్చారు. అందుకు బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు
సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన సూర్యారాధనలో పాల్గొన్నారు. ఇందు కోసం ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు. పవన్ కళ్యాణ్ గతంలో రోజూ సూర్య నమస్కారాలు చేసే వారు. అయితే గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించిన చిన్న ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీంతో సూర్య నమస్కారాలు చేయడానికి విరామం ఇచ్చారు. అందుకు బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు.
సూర్యారాధన చేసిన పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా వేద పండితులు సూర్యుని విశిష్ఠతను తెలియజేశారు. ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోందన్నారు. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని, నిజానికి మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందన్నారు. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని గుర్తు చేశారు. అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అంటారని వేద పండితులు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..