Guru Purnima: ఈ ఏడాది గురుపౌర్ణమి విషయంలో గందరగోళం.. ఏ తేదీన జరుపుకోవాలి .. పూజా విధానం ఏమిటంటే..

గురు పూర్ణిమ రోజున పూజలు, ఉపవాసం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దీనితో పాటు ఈ రోజున గురువులను ఆరాధించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ ఏడాది గురు పూర్ణిమ జరుపుకునే తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. అటువంటి పరిస్థితిలో గురు పూర్ణిమ ఉపవాసం ఎప్పుడు ఆచరించవచ్చు.. శుభ సమయం, ప్రాముఖ్యత ,పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Guru Purnima: ఈ ఏడాది గురుపౌర్ణమి విషయంలో గందరగోళం.. ఏ తేదీన జరుపుకోవాలి .. పూజా విధానం ఏమిటంటే..
Guru Purnima 2024
Follow us

|

Updated on: Jul 05, 2024 | 7:38 AM

ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురు పూర్ణిమను ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. మానవాళికి మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని అందించిన వేద వ్యాసుడు జన్మించిన రోజుని ఆషాడ మాసం పౌర్ణమి అని నమ్ముతారు. అందుకే ఈ రోజును వేద వ్యాసుడు జన్మదినంగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున పూజలు, ఉపవాసం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దీనితో పాటు ఈ రోజున గురువులను ఆరాధించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ ఏడాది గురు పూర్ణిమ జరుపుకునే తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. అటువంటి పరిస్థితిలో గురు పూర్ణిమ ఉపవాసం ఎప్పుడు ఆచరించవచ్చు.. శుభ సమయం, ప్రాముఖ్యత ,పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

2024 గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే

పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిధి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూలై 21 సాయంత్రం 3:47 గంటలకు ముగుస్తుంది.

శాస్త్రాల ప్రకారం చంద్రోదయ సమయాన్ని అది కూడా రాత్రి పౌర్ణమి తిది ఉన్న రోజుని మాత్రమే పూర్ణిమ తిథిగా భావిస్తారు. అంతేకాదు ఈ రోజునే పున్నమి ఉపవాసం ఆచరిస్తారు. పూర్ణిమ తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం, పూజలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో జూలై 20న గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ రోజు వ్రతం ఆచరించి మర్నాడు అంటే జూలై 21వ తేదీ న గురు పౌర్ణమి మిగుల తిధి సందర్భంగా దానధర్మాలు చేయడం మంచిది అని పండితులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గురు పూర్ణిమ పూజ విధి

  1. గురు పూర్ణిమ రోజున, తెల్లవారుజామున నిద్రలేచి.. స్నానం చేసి శ్రీ మహా విష్ణువును ధ్యానించాలి.
  2. ముందుగా విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేసి పసుపు వస్త్రాలు సమర్పించండి.
  3. పూజ గదిని శుభ్రపరిచిన తర్వాత, విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసుడు విగ్రహాలను ప్రతిష్టించండి.
  4. దీని తరువాత దేవుళ్లకు చందన తిలకం అద్ది కుంకుమ పెట్టి ఉపవాస దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేయండి.
  5. అప్పుడు విష్ణువుతో, లక్ష్మీదేవిని, వేదవ్యాసుడిని పూజించండి.
  6. దీని తరువాత గురు చాలీసా పారాయణం, దానితో పాటు గురు పూర్ణిమ వ్రత కథను పఠించండి.
  7. విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసులకు స్వీట్లు, పండ్లు, పువ్వులు, ఖీర్ మొదలైన వాటిని సమర్పించండి.
  8. చివరగా స్వామికి హారతి ఇవ్వండి. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని ప్రార్ధించండి.

గురు పూర్ణిమ ప్రాముఖ్యత

పౌరాణిక విశ్వాసాల ప్రకారం గురు పూర్ణిమను మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున వేదవ్యాసుడి నాలుగు వేదాలను రచించాడని నమ్ముతారు. ఈ రోజున గురువు తన శిష్యులకు కూడా దీక్షను ఇస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ గురువులను పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!