AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Fever: కర్నాటకలో 24 వేలకు పైగా డెంగ్యూ కేసులు.. హై అలెర్ట్‌ ప్రకటన.. హాట్‌స్పాట్‌లను గుర్తించాలని సూచన

కర్ణాటక రాజధాని బెంగళూరులో డెంగ్యూ వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నాటక వ్యాప్తంగా 24 వేలకు పైగా డెంగ్యూ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అటు.. డెంగ్యూ విజృంభణతో కన్నడ సర్కార్‌ హై అలెర్ట్‌ ప్రకటించింది. 

Dengue Fever: కర్నాటకలో 24 వేలకు పైగా డెంగ్యూ కేసులు.. హై అలెర్ట్‌ ప్రకటన.. హాట్‌స్పాట్‌లను గుర్తించాలని సూచన
Drinks for Dengue
Surya Kala
|

Updated on: Jul 05, 2024 | 6:32 AM

Share

కర్నాటక రాష్ట్రాన్ని డెంగ్యూ వైరస్‌ వణికిస్తోంది. బెంగళూరు సహా కర్నాటకను డెంగ్యూ కమ్మేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 24 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో కర్నాటక ప్రజల్లో అల్లాడిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కర్నాటకలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా.. బెంగళూరులో డెంగ్యూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కర్నాటక వ్యాప్తంగా 12వేల కేసులు నమోదైతే.. ఒక్క బెంగళూరు సిటీలోనే 12 వేల కేసులు నమోదు కావడం భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 286 డెంగ్యూ కేసులు గుర్తించబడ్డాయి. మొత్తం 52వేల214 మందికి బ్లడ్‌ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

డెంగ్యూ విజృంభణతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తం అయింది. డెంగ్యూ కేసులపై నిఘా ఉంచాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ సీఈవోలను ఆదేశించారు. వర్చువల్ మీటింగ్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన.. డెంగ్యూ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫీవర్ క్లినిక్‌లను తెరవాలని, అక్టోబర్ వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డెంగ్యూ హాట్‌స్పాట్‌లను గుర్తించాలని.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రానికి సూచించామన్నారు. వ్యాధి కార‌క ప్రాంతాల్లో జ్వరాల‌ ల‌క్షణాలు ఉన్న వారికి డెంగ్యూ ప‌రీక్షలు చేయించుకోవాల‌ని చెప్పారు. రానున్న రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి డెంగ్యూపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఎక్కువ కేసులు నమోదైన జిల్లాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. జూన్ 28 నుండి జూలై 3 వరకు బెంగళూరు మున్సిపాలిటీ పరిధిలోని 7.66 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు అధికారులు. 5,002 ఇళ్లలో డెంగ్యూ లార్వా పాజిటివ్‌గా గుర్తించగా.. మరో ఎనిమిది మండలాల్లోని 1,473 బృందాలు.. 26,259 కంటైనర్లలో డెంగ్యూ లార్వాలను కనుగొన్నాయి. అయితే.. డెంగ్యూ ఎలా వ్యాపిస్తుందో.. కేసులు ఎప్పుడుపెరుగుతాయో.. తెలిసినప్పటికీ.. దేశంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా.. కన్నడనాట డెంగ్యూ విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..