- Telugu News Photo Gallery Cricket photos Who Is Neem Karoli Baba; Spotted In Virat Kohli's Wallpaper, Details Here
Virat Kohli: కోహ్లీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఉన్నది ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే
ముంబైలో టీమిండియా విజయోత్సవ పరేడ్ అనంతరం.. విరాట్ కోహ్లీ లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ముంబై విమానాశ్రయం చేరుకున్నప్పుడు.. అందరి కళ్లు అతడి మొబైల్ వాల్‌పేపర్‌పై పడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Updated on: Jul 05, 2024 | 6:11 PM

ముంబైలో టీమిండియా విజయోత్సవ పరేడ్ అనంతరం.. విరాట్ కోహ్లీ లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ముంబై విమానాశ్రయం చేరుకున్నప్పుడు.. అందరి కళ్లు అతడి మొబైల్ వాల్‌పేపర్‌పై పడ్డాయి.

ఇక విరాట్ మొబైల్ వాల్‌పేపర్‌లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు.. హనుమంతుడి భక్తుడైన నీమ్ కరోలీ బాబా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విరాట్‌కి భక్తిభావం ఎక్కువ. నీమ్ కరోలీ బాబా.. విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక ప్రయాణం స్పూర్తికి మూలకారణం. యూపీలో 1990లో జన్మించిన నీమ్ కరోలీ బాబా అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. చిన్నతనంలోనే సాధువుగా మారారు.

తన ప్రవచనాల ద్వారా లక్షలాది మంది భక్తులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1973లో బాబా మరణించారు. 2021లో విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి వ్రిందవాన్‌లోని బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. అంతేకాదు పలుమార్లు తన కుటుంబంతో కలిసి బాబా ఆశ్రమానికి ఆశీర్వాదం కోసం వెళ్తుంటాడు విరాట్ కోహ్లీ.

కాగా, బార్బోడోస్ నుంచి న్యూఢిల్లీకి 16 గంటల పాటు ప్రయాణించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లగా.. ఆ వెంటనే ముంబైలో విజయోత్సవ పరేడ్‌లో పాల్గొన్నాడు. ఇక అనంతరం భార్య అనుష్క, తమ పిల్లలను కలుసుకునేందుకు లండన్ వెళ్లాడు విరాట్ కోహ్లీ.




