AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. పెళ్లి, హనీమూన్ కోసం ఈ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే

పెళ్లి అనేది ఏ వ్యక్తి జీవితంలోనైనా మధురమైన క్షణం. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి విలాసవంతంగా జరగాలని కోరుకుంటారు. అందుకోసం తమ తాహతకు తగ్గట్టుగా లక్షలు, కోట్లు ఖర్చుపెడుతుంటారు. అయితే ఈ కిలాడీ కేటుగాడు తన పెళ్లి, హనీమూన్ కోసం కాస్త వెరైటీ ప్లాన్ ఆలోచించాడు. ఆ వివరాలు..

Viral: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. పెళ్లి, హనీమూన్ కోసం ఈ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే
Money
Ravi Kiran
|

Updated on: Jul 06, 2024 | 5:35 PM

Share

పెళ్లి అనేది ఏ వ్యక్తి జీవితంలోనైనా మధురమైన క్షణం. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి విలాసవంతంగా జరగాలని కోరుకుంటారు. అందుకోసం తమ తాహతకు తగ్గట్టుగా లక్షలు, కోట్లు ఖర్చుపెడుతుంటారు. అయితే ఈ కిలాడీ కేటుగాడు తన పెళ్లి, హనీమూన్ కోసం కాస్త వెరైటీ ప్లాన్ ఆలోచించాడు. తన పధకానికి తగ్గట్టుగానే.. అతడు పని చేసే కంపెనీకి కన్నం వేసి.. చివరికి కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. రాజ్ ముఖేష్ గణతర అనే వ్యక్తి తన కంపెనీని.. పెళ్లి, హనీమూన్ కోసం ఏకంగా రూ. 10.6 కోట్లకు ముంచేశాడు. 2014-22 మధ్య సదరు వ్యక్తి ఏకంగా 42 బ్యాంక్ లోన్లు తీసుకున్నాడు. ఇక ఇందులో 31 లోన్లను కొట్టేసిన అమౌంట్ ద్వారా కట్టాడు. మరో రూ. 15 లక్షలు షేర్ మార్కెట్, మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టాడు. అలాగే ఆ మిగిలిన డబ్బు నుంచి రూ. 16 లక్షలు సదరు వ్యక్తి పెళ్లి కోసం.. రూ. 3.5 లక్షలు హనీమూన్ కోసం ఖర్చు చేశాడు. అతడు ఈ పధకం అమలు చేసేందుకు తన సోదరి, స్నేహితుడు, భార్య ఖాతాలను ఉపయోగించినట్లు పోలీసులు విచారణలో తేలింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాశ కారణంగానే కంపెనీలో ఇంత పెద్ద మొత్తం చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి