AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నారా.? వాట్సాప్‌లో ఇలా ఫిర్యాదు చేయండి

10, 20 రూపాయల కోసం ఏం కంప్లైంట్ చేస్తాం అనుకోకండి. ఇలానే అనుకుంటూ పోతే.. అడ్డూ అదుపు లేకుండా వసూళ్లకు పాల్పడుతూ ఉంటారు. కొందరు వ్యాపారులు అయితే.. MRPకే అమ్మాలి కదా అడిగితే.. మా దగ్గర రేట్స్ ఇంతే.. మీ ఇష్టం ఉంటే కొనండి లేదంటే.. లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఇలా ఎక్కువ ధరకు అమ్మడం, క్వాలిటీ లేకుండా ప్రొడక్ట్స్ అమ్మడం వంటివి జరిగితే..

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నారా.? వాట్సాప్‌లో ఇలా ఫిర్యాదు చేయండి
Products
Ranjith Muppidi
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 06, 2024 | 2:03 PM

Share

మాల్స్, సినిమా హాల్స్, మల్టిఫ్లెక్సులు ఇలా ఎక్కడైనా సరే MRP ధరకే వస్తువులు అమ్మాలి. ఎక్కువకు అమ్మితే మనం వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చు. 10, 20 రూపాయల కోసం ఏం కంప్లైంట్ చేస్తాం అనుకోకండి. ఇలానే అనుకుంటూ పోతే.. అడ్డూ అదుపు లేకుండా వసూళ్లకు పాల్పడుతూ ఉంటారు. కొందరు వ్యాపారులు అయితే.. MRPకే అమ్మాలి కదా అడిగితే.. మా దగ్గర రేట్స్ ఇంతే.. మీ ఇష్టం ఉంటే కొనండి లేదంటే.. లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఇలా ఎక్కువ ధరకు అమ్మడం, క్వాలిటీ లేకుండా ప్రొడక్ట్స్ అమ్మడం వంటివి జరిగితే.. కొందరు ఫిర్యాదు చేయాలనుకుంటారు కానీ.. ఎలా అనే అంశంపై క్లారిటీ ఉండదు.

ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు మీరు కన్జూమర్ ఫోరంను ఆశ్రయించవచ్చు. డైరెక్ట్ ఆఫీసుకు వెళ్లాల్సిన పనికూడా లేదు. వాట్సాప్‌ ద్వారానే కంప్లైంట్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది..కేంద్ర ప్రభుత్వం. 88000 01915 నంబర్.. వాట్సాప్ చేయడం ద్వారా మీ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. తొలుత ఆ నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్‌ అని పెట్టాలి. ఆ తర్వాత అక్కడ వచ్చే సూచనల ఆధారంగా డీటేల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

వివరాలు నమోదు తర్వాత జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో మీ ఫిర్యాదు ఫైల్ అవుతుంది. ఆ తర్వాత.. మీ కేసు వివరాలను స్థానికంగా ఉండే జిల్లా వినియోగదారుల కమిషన్‌కు అక్కడి నుంచి పంపి.. పరిష్కారం చేయాలని సూచిస్తారు. అంతేకాదు కేసుకు సంబంధించి సూచనలు, సలహాలు కూడా అదే వాట్సాప్ నంబర్ నుంచి అందుతాయి. ఇక 1915, 1800114000 నంబర్లకు కాల్ చేసి కూడా మీ ఫిర్యాదును తెలియజేయవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.