Health: ఎక్కువసేపు ఒకేచోట నిలబడుతున్నారా.? ఇలా చేస్తే ఏరికోరి రోగులు కొనితెచ్చుకున్నట్టే
ఎక్కువసేపు ఒకేచోట నిల్చోవడం వల్ల వెరికోస్ వీన్స్ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఇది కాళ్లల్లో కనిపించే రక్తనాళాల సమస్య ఇది. ఆ సమస్య ఏంటో తెలియాలంటే.. ఈ వార్త చూసేయండి. మీరూ ఓ సారి లుక్కేయండి మరి.

ఎక్కువసేపు ఒకేచోట నిల్చోవడం వల్ల మన శరీరానికి.. ముఖ్యంగా కాళ్లకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్ళల్లోని సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపించడంలో ఇబ్బంది పడతాయి. సిరలలో ఉండే కవాటాలు బలహీనపడటం వల్ల రక్తం కిందనే పోగుపడి.. రాలు బయటకు పొంగడం, నొప్పి పెట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. దీనినే వెరికోస్ వీన్స్ అంటారు. ఎక్కువ సమయం నిలబడి పనులు చేసేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారికి.. నొప్పి, వాపు, మంట, దురద లాంటి లక్షణాలు ఉంటాయి. చర్మం పొడిబారి, చిన్న చిన్న గాయాల వల్ల కూడా తీవ్రమైన రక్తస్రావం జరగవచ్చు. ఈ సమస్యను తగ్గించాలంటే.. ఎక్కువసేపు ఒకేచోట నిల్చోవడాన్ని తగ్గించుకోవాలి. తరచుగా చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. అటూ.. ఇటూ.. నడవాలి. పిక్క కండరాలను సాగదీయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవడం, పొగతాగడం మానేయాలి, చురుకుగా ఉండటం లాంటి జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది. అలాగే బిగుతు సాక్సులు ధరించడం ద్వారా సిరలపై ఒత్తిడిని తగ్గించి, రక్తం పైకి ప్రవహించడానికి సహాయపడుతుంది. కాగా, వెరికోజ్ వీన్స్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




