AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎవరో గుర్తుపట్టారా

పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఈమె ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. బుల్లితెరపై యాంకర్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. అలాగే బిగ్‌బాస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈమె ఓ గ్లామర్ క్వీన్.

Tollywood: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎవరో గుర్తుపట్టారా
Tollywood
Ravi Kiran
|

Updated on: Jul 09, 2024 | 12:27 PM

Share

పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఈమె ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. బుల్లితెరపై యాంకర్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. అలాగే బిగ్‌బాస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈమె ఓ గ్లామర్ క్వీన్. ఈ వయ్యారి ఇటీవల సోషల్ మీడియాలో తన అందాల జాతరతో ఫాలోవర్స్‌కు సెగలు పుట్టిస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? మరెవరో కాదు అరియానా గ్లోరీ. ప్రస్తుతం ఈ అమ్మడి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో చూడగానే మొదట ఫ్యాన్స్‌కు గుర్తుపట్టడం కష్టమే. కానీ ఆ తర్వాత ఈమే అరియానా అని తెలిశాక.. ‘చిన్నప్పుడు ఈ బ్యూటీ.. ఇంతందంగా ఉందా’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అరియానా అసలు పేరు మంగలి అర్చన. 2015లో ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి తెగ ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. తన కెరీర్‌‌లో కీలక టర్నింగ్ పాయింట్ జరిగింది. ఈ షో ద్వారా అమ్మడికి వరుసగా పలు టీవీ షోలలో ఆఫర్స్ తలుపు తట్టాయి. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు ‘బీబీ జోడి’ షోలో కమెడియన్ అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి.. తనలోని మరో యాంగిల్ ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అరియానాకు.. ఇన్‌స్టాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మడు తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ వయ్యారి పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇది కదా కావాల్సింది.! సికింద్రాబాద్ టూ గోవా వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us