Viral Video: ఉన్నట్టుండి నిద్రపోతోన్న యువతిపైకి దూసుకొచ్చిన పాము.. చివరికి జరిగిన సీన్ ఇది

ఈ మధ్యకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తోన్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఫ్రిడ్జ్‌ల్లో, వాహనాల్లో, కిచెన్ రూమ్స్, ఏసీలు.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడ సందు దొరికితే అక్కడ వాటిని తమ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి ఈ సరీసృపాలు. ఇక అలాంటి తరహాలోనే..

Viral Video: ఉన్నట్టుండి నిద్రపోతోన్న యువతిపైకి దూసుకొచ్చిన పాము.. చివరికి జరిగిన సీన్ ఇది
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2024 | 1:19 PM

ఈ మధ్యకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తోన్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఫ్రిడ్జ్‌ల్లో, వాహనాల్లో, కిచెన్ రూమ్స్, ఏసీలు.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడ సందు దొరికితే అక్కడ వాటిని తమ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి ఈ సరీసృపాలు. ఇక అలాంటి తరహాలోనే పాముకు చెందిన ఓ వైరల్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి నిద్రపోతుండగా.. ఉన్నట్టుండి ఎక్కడనుంచి వచ్చిందో ఓ భారీ పాము అటుగా ఆమెపైకి దూసుకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది.?

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి గడ్డినేలపై చాప వేసుకుని పడుకుని ఉంటుంది. ఇక ఆమె గాఢమైన నిద్రలో ఉండగా.. ఉన్నట్టుండి ఓ పెద్ద పాము ఎక్కడ నుంచి వచ్చిందో గానీ.. ఆమెను సమీపించింది. అంతటితో ఆగకుండా ఆమెపైకి పాకడం మొదలుపెట్టింది. ఇక ఆ పాము మెడపైకి రాగానే.. ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పామును చూసి కంగుతిన్నది. దెబ్బకు అక్కడ నుంచి పరుగులు పెడుతుంది. అయితే ఆ పాము సదరు యువతికి ఎలాంటి హనీ తలపెట్టకుండా వెళ్లిపోవడంతో.. అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కు గురికావడమే కాకుండా.. కామెంట్స్‌తో హోరెత్తించారు. కొంతమంది అది ఫేక్ అని.. యాక్టింగ్ అని కామెంట్ చేయగా.. మరికొందరు అది విషపూరితమైన పాము కాదని కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి