Bengaluru Stampede: బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆరోజే తేలనున్న ఆర్సీబీ భవితవ్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను తొలిసారిగా గెలుచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. అయితే ఆ టీమ్ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలిఅపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర జట్టు విజయోత్సవ వేడుకల గురించి కూడా చర్చించనున్నారు. IPL సీజన్-18లో ఛాంపియన్లుగా నిలిచిన RCB, మరుసటి రోజు బెంగళూరులో తమ విజయోత్సవ వేడుకలను జరుపుకొంది. అయితే ఈ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తానని BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనను చూసి మౌనంగా ప్రేక్షకులుగా ఉండలేమని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం, ఐపీఎల్ విజయోత్సవ వేడుకలపై చర్చించడంతో పాటు తొక్కిసలాట వంటి సంఘటనలను నివారించడానికి కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలనుకుంటోంది బీసీసీఐ. అలాగే ఆర్సీబీ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకోవాలా? వద్?దా అనేది కూడా ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం (జూన్ 14) శనివారం జరగనున్న సమావేశం తర్వాత ఐపీఎల్‌లో కొన్ని కొత్త నియమాలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
కాగా ఇదే సమావేశంలో ఆటగాళ్ల వయస్సు ధ్రువీకరణ నియమాలపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా అండర్-16 (బాలురు), అండర్-15 (బాలికలు) విభాగాలలో జరుగుతోన్న అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా బీసీసీఐ సరికొత్త నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. ఆగమ్ రావు తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై చర్య తీసుకుంటూ, బిసిసిఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా అపెక్స్ కౌన్సిల్‌ను తగిన చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయం కూడా చర్చకు రానుంది. వీటితో పాటు ఆటగాళ్లు, జట్టు సిబ్బంది ప్రవర్తనా నియమావళి, BCCI ఉద్యోగులకు టోర్నమెంట్ అలవెన్స్ పాలసీ, 2025-26 దేశీయ సీజన్‌కు సంబంధించిన కొత్త నియమాలు, అంపైర్లు, మ్యాచ్ రిఫరీ కోచ్‌లకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు BCCI వర్గాలు తెలిపాయి.
అమల్లోకి కొత్త నియమాలు..
🚨 REPORTS 🚨
BCCI Apex Council to discuss guidelines for IPL victory celebrations after Bengaluru stampede. 🏟️#Cricket #RCB #IPL2025 #Sportskeeda pic.twitter.com/h0iuyOke1o
— Sportskeeda (@Sportskeeda) June 12, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..