Tollywood: ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫిజియో థెరపిస్ట్‌గా సేవలు.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
రాజస్థాన్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు పలు హిందీ భాషల్లో నటించింది. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ మల్టీ ట్యాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫిజియో థెరపిస్ట్ గానూ సేవలు అందిస్తోంది.

చాలా మంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ కెరీర్ కూడా బుల్లితెరతోనే ప్రారంభమైంది. 2012లో ఓ టీవీ షోతో స్మాల్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. ఆ తర్వాత 2017లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే వరుణ్ ధావన్, అలియా భట్ వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత ఒక ఫీల్ గుడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఈ అమ్మడి అందం, అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక రెండో సినిమా అవకాశం కూడా వెంటనే వచ్చింది. అది కూడా అక్కినేని అందగాడు నాగార్జున, న్యాచురల్ స్టార్ నానిల సినిమాలో హీరోయిన్ ఛాన్స్. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. అయితే దీని తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. మధ్యలో ఒకటి, రెండు తెలుగు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. పలు హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. గత నెల ఆఖరులో విడుదలైన ఈ ఫీల్ గుడ్ సినిమాలో ఆమెతో పాటు సీనియర్ హీరో, హీరోయిన్లు రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కూడా మంచి స్పందన వచ్చింది. అలాగే హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. ఇటీవలే కొత్త కారు కూడా కొనుక్కొన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఆకాంక్ష సింగ్.. ఇలా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ అక్కినేని సుమంత్ నటించిన ఫీల్ గుడ్ మూవీ మళ్లీ రావా హీరోయిన్ అంటే కళ్ల ముందు ఇట్టే ఓ అందమైన రూపం మెదులుతుంది.
ఆకాంక్ష సింగ్ నటించిన తాజా చిత్రం షష్టి పూర్తి. మే 30న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అన్నట్లు ఈ హీరోయిన్ గురించి ఇటీవల ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..ఈ బ్యూటీకి పదేళ్ల క్రితమే పెళ్లైంది. తన చిరకాల ప్రియుడు మార్కెటింగ్ ప్రొఫెషనల్ అయిన కునాల్ సైన్‌ను 2014లోనే వివాహం చేసుకుంది ఆకాంక్ష. ఇటీవలే తన పదో పెళ్లి రోజును కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
భర్తతో ఆకాంక్ష సింగ్..
View this post on Instagram
కాగా ఉన్నత చదువులు అభ్యసించిన ఆకాంక్ష ఫిజయో థెరపిస్ట్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్ వేయండి మరి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి