Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prema Desam Movie: ‘ప్రేమ దేశం’ హీరో వినీత్ గుర్తున్నాడా? అతని అక్క టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అని తెలుసా?

ప్రేమ దేశం.. 1996లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం యువతను తెగ ఆకట్టుకుంది. అలాగే ఇందులో నటించిన హీరోలు అబ్బాస్, వినిత్ అయితే యూత్ కు మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ హీరోలుగా మారిపోయారు. అలాగే హీరోయిన్ టబు కూడా చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

Prema Desam Movie: 'ప్రేమ దేశం' హీరో వినీత్ గుర్తున్నాడా? అతని అక్క టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అని తెలుసా?
Prema Desam Vineeth
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2025 | 7:09 AM

ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో వినీత్. ముఖ్యంగా ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్ అయితే యూత్ ను తెగ ఆకట్టుకుంది. ప్రేమదేశం మూవీ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా నటించి మెప్పించాడే వినీత్. జెంటిల్ మెన్, సరిగమలు, W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర చిత్రాలు వినీత్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే గతంలోలా ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు వినీత్. అప్పుడప్పుడు మాత్రమే సహాయక నటుడి పాత్రల్లో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. గతేడాది మనోరతంగల్ అనే మల్టీ స్టారర్ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో కనిపించాడు వినీత్. సినిమాలతో పాటు అప్పుడప్పుడు డ్యాన్స్ కచేరీల్లో కనిపిస్తుంటాడు వినీత్. ఇతనికి క్లాసికల్ డ్యాన్స్ లో మంచి ప్రావీణ్యముంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే వినీత్.. 2004 ఆగస్ట్ 28న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అవంతి వినీత్ అనే పాప ఉంది. వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కువగా కనిపించదు

ఇదిలా ఉంటే వినీత్ కజిన్ సిస్టర్ కూడా దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్ అని మీకు తెలుసా? ఆమె మరెవరో కాదు శోభన. 90వ దశకంలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 230 కు పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార. కేవలం హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా చాలా విభాగాల్లో సత్తా చాటి మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ అనిపించుకుంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పలు పురస్కారాలు కూడా అందుకుంది.

ఇవి కూడా చదవండి

పద్మ పురస్కారం అందుకుంటోన్న శోభన..

దాదాపు 18 ఏళ్లు గ్యాప్ తీసుకున్న శోభన గతేడాది సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్రభాస్‌తో కలిసి కల్కీ2898AD సినిమాలో నటించింది. ఈ సినిమాలో మరియమ్ అనే పాత్రలో శోభన అద్భుతంగా నటించింది. ఇక ఇటీవలే తుడ్ రుమ్ అనే మరో సినిమాలోనూ కనిపించిందీ ముద్దుగుమ్మ. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

తుడ్ రుమ్ సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరో రాజా రఘువంశీని కాలేను.! ప్రియుడితో వెళ్లి పోయిన భార్యకు భర్త
మరో రాజా రఘువంశీని కాలేను.! ప్రియుడితో వెళ్లి పోయిన భార్యకు భర్త
పాత షేర్ సర్టిఫికెట్ కనిపించిందా..?దాన్ని వదిలేస్తే నష్టపోయినట్టే
పాత షేర్ సర్టిఫికెట్ కనిపించిందా..?దాన్ని వదిలేస్తే నష్టపోయినట్టే
పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు షాక్
పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు షాక్
70 ఏళ్ల వృద్ధుడిని ముగ్గులోకి దింపి ముచ్చట్లు.. చివరికీ..!
70 ఏళ్ల వృద్ధుడిని ముగ్గులోకి దింపి ముచ్చట్లు.. చివరికీ..!
భాగ్యనగరంలో ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం సూపర్..
భాగ్యనగరంలో ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం సూపర్..
లచ్చిందేవి ఉందని ఇంటికొచ్చాడు.. ఆ తర్వాత చనిపోతారంటూ నమ్మించి..
లచ్చిందేవి ఉందని ఇంటికొచ్చాడు.. ఆ తర్వాత చనిపోతారంటూ నమ్మించి..
కొత్త ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే సమస్యలు..
కొత్త ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే సమస్యలు..
ఇక ఆ వాహనాలన్నీ తుక్కుకే..వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
ఇక ఆ వాహనాలన్నీ తుక్కుకే..వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
వర్షాకాలం వేళ మైసూర్ మహా అద్భుతం.. ఫోటోగ్రాఫర్స్ కోసం ఉత్తమ ఎంపిక
వర్షాకాలం వేళ మైసూర్ మహా అద్భుతం.. ఫోటోగ్రాఫర్స్ కోసం ఉత్తమ ఎంపిక
భారత్-UAE సంబంధాలు బలపర్చడమే లక్ష్యం!
భారత్-UAE సంబంధాలు బలపర్చడమే లక్ష్యం!