Tollywood: ఆస్పత్రి బెడ్‌పై దీన స్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఏమైందంటే?
ఈ హీరోయిన్ తెలుగుతో పాటు హిందీ తదితన భాషల్లో పలు సినిమాలు చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ తరచూ అనారోగ్యం పాలవుతోంది. ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరింది.

గతంలో పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన హీరోయిన్ సనా మక్బుల్ తీవ్ర అనారోగ్యం బారిన పడింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. ఈ విషయాన్ని డాక్టర్ ఆశ్నా కంచ్‌వాలా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సనా మక్బుల్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను నెట్టింట షేర్ చేసిన ఆమె ‘మై డియర్ స్ట్రాంగ్ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి నేను చాలా గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు. ఈ కఠినమైన పరిస్థితుల నుంచి నువ్వు త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉన్నాను’అని సదరు నటికి ధైర్యం నూరిపోశారు. ప్రస్తుతం సనా మక్బుల్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సనా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా సనా మక్బుల్ ఇటీవల తన కాలేయ వ్యాధి గురించి బయటపెట్టింది. ఆమె 2020 నుంచి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన శరీరంలోని కణాలు కాలేయంపై దాడి చేస్తాయని పేర్కొంది. ఇప్పుడు దీని కారణంగానే సనా ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.
కాలేయ సంబంధిత సమస్యలతో..
Sana Makbul Hospitalised
Bigg Boss OTT 3 winner and actress Sana Makbul has been admitted to the hospital due to a “grave condition,” as confirmed by her close friend Aashna Kanchwala.
Though details remain private, Sana has previously opened up about battling autoimmune… pic.twitter.com/mIvN4aNfYK
— Filmore (@filmoreindia) June 9, 2025
ఇక ముంబైకు చెందిన సనా మక్బుల్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. దిక్కులు చూడకు రామయ్య అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలాగే మామ ఓ చందమామ, రంగూన్ (తమిళ్) సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. గతేడాది జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విజేతగానూ నిలిచింది.
సనా మక్బుల్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి