AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: మరోసారి అందరి మనసులు గెల్చుకున్న సోనూసూద్.. తిరుమలలో ఏం చేశాడో తెలుసా? వీడియో ఇదిగో

ప్రముఖ నటుడు, దర్శకుడు సోనూసూద్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుమల శ్రీవారి మాడ వీధుల్లో కలియ తిరిగాడీ రియల్ హీరో. అక్కడున్న వ్యాపారులతో సరదాగా ముచ్చటించాడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

Sonu Sood: మరోసారి అందరి మనసులు గెల్చుకున్న సోనూసూద్.. తిరుమలలో ఏం చేశాడో తెలుసా? వీడియో ఇదిగో
Sonu Sood
Basha Shek
|

Updated on: Jun 08, 2025 | 8:18 PM

Share

రీల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనా ఆపత్కాలంలో అతను అందించిన సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ తర్వాత కూడా సోనూ సేద్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నాడీ రియల్ హీరో. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా ఉంటోన్న సోనూసూద్ ఇటీవల తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నాడు. అయితే తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుమల అంతా కలియ తిరిగాడు సోనూసూద్. ఇదే క్రమంలో తిరుమ‌ల‌లో తట్టపైన బేల్ పూరి విక్రయిస్తున్న చిరువ్యాపారి జ్యోతితో సరదాగా ముచ్చటించాడు. ఆమె కుటుంబ విషయాలు, యోగక్షేమాలు, అలాగే వ్యాపార విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇక బేల్ పూరి ధ‌ర అడిగి తెలుసుకున్న సోనూసూద్ ఆ త‌ర్వాత ఆమె ద‌గ్గ‌ర కొను గోలు చేసి రుచి చూశాడు. భేల్ పూరి చాలా బాగుంద‌ని ఆమెకు కితాబిచ్చాడు. చిరు వ్యాపారుల ద‌గ్గ‌ర మ‌నం కొనుగోలు చేసి వారిని ప్రోత్స‌హించాల‌ని సోనూసూద్ చెప్ప‌డంతో జ్యోతి చాలా సంబరపడిపోయింది. గత 25 సంవత్సరాలుగా తిరుమలలో భేల్ పూరి విక్రయిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా స్టార్ అయినా ఓ సాధారణ వ్యక్తిలా భేల్ పూరి కొను గోలు చేసి జ్యోతితో ముచ్చటించాడు సోనూ సూద్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తిరుమల వీధుల్లో సోనూ సూద్.. వీడియో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నంది పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూ సూద్. ఇందులో తాను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నట్లు తెలిపాడు. ‘ నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాం.  అందులో నేను నటిండటంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నాను. త్వరలోనే మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను’ అని సోనూ చెప్పుకొచ్చాడు.

అవార్డుతో రియల్ హీరో..

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..