Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బంగారం కోసం పుష్పను మించిన ప్లాన్.. ఓటీటీలో మతిపోగొట్టే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో పోలీసుల కళ్లు గప్పి ఎర్ర చందనాన్ని ఎలా విదేశాలకు తరలించారో చూశాం. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. గోల్డ్ స్మగ్లింగ్ మొదలై ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ చుట్టూ తిరుగుతుంది.

OTT Movie: బంగారం కోసం పుష్పను మించిన ప్లాన్.. ఓటీటీలో మతిపోగొట్టే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 07, 2025 | 2:25 PM

Share

మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో మాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందులోనూ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకైతే మరీనూ. ఈ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో పోలీసుల కళ్లు గప్పి ఎర్ర చందనాన్ని ఎలా విదేశాలకు తరలించారో చూశాం. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. గోల్డ్ స్మగ్లింగ్ మొదలై ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ చుట్టూ తిరుగుతుంది. పుష్ప సినిమా తరహాలోనే ఈ మూవీ కూడా గోల్డ్ స్మగ్లింగ్ తో మొదలౌతుంది. ఆ తరువాత ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. చివరిదాకా సస్పెన్స్ తో ఉత్కంఠంగా సాగుతుంది. ఇక ట్విస్టులు అయితే మతిపోగొడతాయి. ముత్తు, కన్నన్ అనే వ్యక్తుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వీరిద్దరూ బంగారం వ్యాపారం చేస్తుంటారు. ముత్తు బంగారు ఆభరణాలు తయ్యారు చేస్తుంటే, కన్నన్ వాటిని ముంబై వంటి నగరాలకు రవాణా చేస్తుంటాడు. అయితే ఇందులో చాలా లొసుగులు ఉంటాయి. వీటి గురించి పోలీసులకు తెలియకుండా లోగుట్టుగా ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటారు. ఒక రోజు కన్నన్, ముత్తు మరొకరితో కలిసి బంగారు డెలివరీ కోసం కోయంబత్తూర్‌కు వెళతారు. అక్కడ పనయ్యాక కన్నన్ ఒంటరిగా ముంబైకి వెళ్లిపోతాడు. అయితే అతను అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. కట్ చేస్తే.. కన్నన్ ఒక హోటల్ గదిలో శవమై కనిపిస్తాడు. అతనిని దారుణంగా హత్య చేశారని పోస్ట్‌మార్టంలో తేలుతుంది.

మరి కన్నన్ తో పాటు ఉన్న 8 కిలోల బంగారం ఎక్కడకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకోవడానికి పోలీసులతో కలిసి పని చేస్తాడు ముత్తు. మరి కన్నన్ ను దారుణంగా చంపింది ఎవరు? ఆ 8 కిలోల బంగారం ఎక్కడకు వెళ్లింది? అనే విషయలు తెలుసుకోవాలంటే తంకం సినిమా చూడాల్సిందే. ఇందులో రణం సినిమా విలన్ బిజు మీనన్ ముత్తు పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇక అతని స్నేహితుడు కన్నన్ పాత్రలో వినీత్ శ్రీనివాసన్ కనిపిస్తాడు. అలాగే అపర్ణ బాలమురళి, గిరీష్ కులకర్ణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి తంకం ఓ మంచి ఛాయిస్. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.. కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..