AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి పాచి పని.. తండ్రి కొబ్బరి కాయల విక్రయం.. ఈ నటుడి ఇన్‌స్పైరింగ్ జర్నీ చదవాల్సిందే

ఈ యంగ్ హీరో కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇతని తల్లి ఇంటింటికీ పనిచేసేది. తండ్రి రోడ్డుపై కొబ్బరి కాయలు అమ్మేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన అతను తన వ్యయ ప్రయాసల కోర్చి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.ఇప్పుడు సూపర్‌హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

Tollywood: తల్లి పాచి పని.. తండ్రి కొబ్బరి కాయల విక్రయం.. ఈ నటుడి ఇన్‌స్పైరింగ్ జర్నీ చదవాల్సిందే
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jun 05, 2025 | 1:03 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు చూసిన వారే. అయితేనేం తమకున్న ట్యాలెంట్ తో సినిమా పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపును, స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే చాలా చిన్న వయసులోనే, అతి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటులు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ యంగ్ హీరో కూడా ఒకడు. ఈ నటుడి తల్లి ఒకప్పుడు ఇంటింటికీ వెళ్లి గిన్నెలు కడిగేదట. ఇతర పనులు కూడా చేసేదట. ఇక తండ్రి అయితే రోడ్డుపై కొబ్బరి నీళ్లు అమ్మేవాడట. అయితే తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరి నుంచి చూసిన ఈ నటుడు ఎలాగైనా డబ్బు సంపాదించి తన అమ్మానాన్నల కష్టాలు తీర్చాలనుకున్నాడు. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు. ఆ యువ నటుడు మరెవరో కాదు ఇటీవలే కేన్స్ లో మెరిసిన విశాల్ జెత్వా.

‘నేను చాలా సాధారణ పేద కుటుంబం నుండి వచ్చాను. మా అమ్మ చాలా మంది ఇళ్లలో పని చేసింది. సూపర్ మార్కెట్లలో శానిటరీ ప్యాడ్‌లను కూడా అమ్మేది. నాన్న కొబ్బరి నీళ్లు అమ్మేవాడు’ అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు విశాల్ జెత్వా. ఇటీవల ముగిసిన ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హోమ్‌బౌండ్’ చిత్రంతో అరంగేట్రం చేయడం ద్వారా అందరి మనసులు గెలుచుకున్నాడు విశాల్. ‘హోమ్‌బౌండ్’ చిత్రం 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపికైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇదే సందర్భంగా కేన్స్ కు తన తల్లితో కలిసి వచ్చాడు విశాల్. అంతేకాదు తన తల్లిని రెడ్ కార్పెట్‌పైకి తీసుకురావడం ద్వారా అందరి హృదయాలు గెల్చుకున్నాడు.

కేన్స్ లో విశాల్ జెత్వా..

కేన్స్‌కు వెళ్లే ముందు తాను చాలా భయపడ్డానని, వెళ్లాలనే ఆలోచనను కూడా వదులుకోవాలని అనుకున్నానని విశాల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు విశాల్. ఇంగ్లీష్ సరిగా రాకపోవడం, అక్కడి హై ప్రొఫైల్ సెలబ్రిటీల్లో ఎలా ఉండాలో తెలియక తికమక పడ్డాడు. అయితే అప్పటికే ఎన్నో కష్టాలు చూసిన విశాల్ తన తల్లిదండ్రులతో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచాడు. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..