- Telugu News Photo Gallery Cinema photos Rambha Birthday Special: Have You Ever Seen This Senior Actress Daughter, See How Beautiful She Is Looking Now
Rambha: సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీని చూశారా? హీరోయిన్ లాంటి కూతురు.. ఫొటోస్ ఇదిగో
అలనాటి అందాల తార రంభ పుట్టిన రోజు ఇవాళ (జూన్ 05). పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోన్న రంభ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం రండి.
Updated on: Jun 05, 2025 | 7:56 AM

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్లలో రంభ ఒకరు. ఈ బ్యూటీ నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ కావడంతో అదే స్థిరపడిపోయింది.

రంభ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, జగపతి బాబు, రాజ శేఖర్,సుమన్, జేడీ చక్రవర్తి తదితర స్టార్ హీరోలతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది రంభ. 1992 నుంచి 2011 వరకు సినిమాల్లో నటించిన ఈ అందాల తార చివరి చిత్రం ద ఫిలింస్టార్. ఈ మలయాళ సినిమా 2011లో విడుదలైంది.

2010లో బిజినెస్‌మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది రంభ. ప్రస్తుతం ఈ అన్యోన్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు.

కాగా రంభ పెద్ద కూతురు మాత్రం అందంగా మెరిసిపోతోందనే చెప్పాలి. అందంలో తల్లి రంభకే పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ హీరోయిన్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా చాలా మంది హీరోయిన్ల లాగే రంభ కూడా రీ ఎంట్రీ ఇస్తుందేమోనని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది.




