- Telugu News Photo Gallery Cinema photos Do You Know Pawan Kalyan Was First Choice For Nijam Movie Before Mahesh Babu
Mahesh Babu : మెగా హీరో రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. మహేష్ ఖాతాలో అతిపెద్ద డిజాస్టర్..
సాధారణంగా సినీరంగంలో ఒక హీరో కోసం రాసుకున్న కథలు మరో నటుడికి చేరుతుంటాయి. ఒక స్టార్ ఖాతాలో పడాల్సిన హిట్స్, ప్లాప్స్ మరో హీరోకు వస్తుంటాయి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా. మెగా హీరో రిజెక్ట్ చేసిన కథతో భారీ డిజాస్టర్ అందుకున్నారు మహేష్ బాబు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?
Updated on: Jun 05, 2025 | 2:02 PM

ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29 ప్రాజెక్టులో నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే ఇందులో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ జోడిగా ప్రియాంక చోప్రా కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని అట్టర్ ప్లాప్ చిత్రాలు సైతం ఉన్నాయి. అందులో నిజం మూవీ ఒకటి. మహేష్ ఇప్పటివరకు చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించారు.

ఇందులో మహేష్ జోడిగా రక్షిత నటించింది. అలాగే హీరో గోపిచంద్, రాశి విలన్ పాత్రలతో అదరగొట్టేశారు. 2003 మే 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ మహేష్ మాత్రం తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటిగా తాళ్లూరి రామేశ్వరి నంది అవార్డ్స్ అందుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఈచిత్రానికి ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదట. అవును ఈ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలనుకున్నారట.

ముందుగా ఈ స్టోరీని పవన్ కళ్యాణ్ కు చెప్పగా.. సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఆ తర్వాత నిజం కథ మహేష్ వద్దకు వెళ్లింది. 2003లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




