- Telugu News Photo Gallery Cinema photos Actress meenakshi chaudhary shared her latest yellow dress photos
ఎల్లో డ్రస్‌లో ఎల్లోరా శిల్పంలా మెరిసిన మీనాక్షి చౌదరి.. కట్టిపడేస్తున్న ఫోటోలు
మీనాక్షి చౌదరి. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.
Updated on: Jun 04, 2025 | 8:46 PM

మీనాక్షి చౌదరి. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.

ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.

ఇవి కాక విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి క్రేజ్ డబుల్ అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.

తెలుగు తమిళ్ లో అవకాశాలు అందుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇటీవలే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది. ఇవికాక పలు తమిళ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఓ వైపు చీరకట్టులో సంప్రదాయంగా మెరుస్తూనే మరో వైపు మోడ్రన్ డ్రస్సుల్లో మెరుస్తుంది. తాజాగా ఇలా ఎల్లో కలర్ డ్రస్ లో అదరగొట్టేసింది. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.




