- Telugu News Photo Gallery Cinema photos Prabhas upcoming movies with different concept know the details here
The Rajasaa: లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తా అంటున్న ప్రభాస్..
లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తా అంటున్నారు ప్రభాస్. డార్లింగ్ కాంపౌండ్ నుంచి మోస్ట్ అవెయిటెడ్ అప్‌డేట్ వచ్చింది. ది రాజాసాబ్ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు బిగ్ టార్గెట్‌తో బరిలో దిగుతున్న బాహుబలి... సెంటిమెంట్స్‌ను కూడా ఫాలో అవుతున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. చాలా కాలం తరువాత ప్రభాస్ చేస్తున్న కామెడీ మూవీ కావటం..
Updated on: Jun 04, 2025 | 8:58 PM

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. చాలా కాలం తరువాత ప్రభాస్ చేస్తున్న కామెడీ మూవీ కావటం, అది కూడా హారర్ కామెడీ కావటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే ఈ మూవీ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ది రాజాసాబ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. డిసెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని ఎనౌన్స్ చేసింది.

అయితే ఈ డేట్ విషయంలోనూ చర్చ జరుగుతోంది.లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న ఇండియన్ సినిమా రికార్డ్‌లు తిరగరాసిన పుష్ప 2 రిలీజ్ అయ్యింది. పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు డిసెంబర్ ఫస్ట్ వీక్ మీద పెద్దగా బజ్ ఉండేది కాదు.

హాలీడే సీజన్ కాకపోవటంతో ఆ డేట్స్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ పుష్ప 2 రిలీజ్ తరువాత అన్ని లెక్కలు మారిపోయాయి. ది రాజాసాబ్ కూడా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

మరోసారి పుష్ప 2 రికార్డ్స్ రిపీట్ అవ్వటం ఖాయం అని భావిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు.




