AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?

వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్ తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆడియెన్స్ ఫేవరేట్ గేమ్ షోగా 'సర్కార్' పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో సీజన్ 5 స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 'సర్కార్ సీజన్ 5' స్ట్రీమింగ్ అవుతుంది. ఈ గేమ్ షో లో సెలబ్రిటీ గెస్ట్స్ ఫుల్ ఎంటర్ టైన్ అందిస్తారు.

Aha OTT: ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?
Aha Sarkaar Season 5
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2025 | 9:28 AM

Share

ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న గేమ్ షో సర్కార్. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ఇప్పటివరకు నాలుగు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకుంది. సినీతారలు, సీరియల్స్ స్టార్లతో క్విజ్ కాన్సెప్ట్ తో సాగే ఈ షో ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో ఈ సర్కార్ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 5 వచ్చేసింది. మొదటి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్టింగ్ చేయగా.. గత నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే తనదైన కామెడీ పంచులతోపాటు.. సరాదా సంభాషణతో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఓటీటీ ప్రియులను అలరిస్తున్నారు సుధీర్. ఇప్పుడు సీజన్ 5 ద్వారా మరోసారి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సర్కార్ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ గేమ్ షో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ‘సర్కార్ సీజన్ 5’ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది ఆహా. అలాగే ఈ గేమ్ షో లో సెలబ్రిటీ గెస్ట్స్ ఫుల్ ఎంటర్ టైన్ అందిస్తారు. ఈ సీజన్ లో సరికొత్త సెగ్మెంట్ సర్కార్ తో ఆటను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ గేమ్ షోలో ప్రేక్షకులు తమ ఇంటి వద్ద నుంచే పాల్గొనవచ్చు. అలాగే ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే సర్ ప్రైజ్ గిఫ్ట్ లు గెల్చుకోవచ్చు. గేమ్ షోస్ కు రారాజుగా పిలుస్తున్న సర్కార్.. ఈ సీజన్ 5తో మరింతగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీంతో పాటు ప్రతి శుక్రవారం ఆహా సరికొత్త మూవీస్, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.

ఇక ఆహా ఓటీటీ ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను, వెబ్ సిరీస్ లను అందిస్తుంది. దుల్కర్ సల్మాన్, సంయుక్త మీనన్ కలిసి ఆరేళ్ల క్రితం నటించిన ఒరు యమండన్ ప్రేమకథ చిత్రాన్ని సైతం తెలుగులో స్ట్రీమింగ్ చేస్తుంది. 2019లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో ఒక యముడి ప్రేమకథ పేరుతో విడుదల చేసింది భవాని మీడియా.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

Follow Us