AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangavva: బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వకు అంతమంది బిడ్డలా? ఏమయ్యారో తెలిస్తే కన్నీళ్లాగవు..

. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చారు గంగవ్వ. ఇందులో తన తెలంగాణ భాష, యాస, కామెడీతో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నారు. ఆ పాపులారిటీతోనే ఏకంగా ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లో రెండు సార్లు పాల్గొన్నారు.

Gangavva: బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వకు అంతమంది బిడ్డలా? ఏమయ్యారో తెలిస్తే కన్నీళ్లాగవు..
Gangavva
Basha Shek
|

Updated on: Jun 05, 2025 | 12:23 PM

Share

గంగవ్వ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం లేని పేరు గంగవ్వ. ఈమె పేరు చెబితే చాలు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు విరబూస్తుంది. బిగ్ బాస్ రియాలిటీ షో లోనూ సందడి చేసింది గంగవ్వ. ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు ఈ రియాలిటీ షోలో సందడి చేసిందామె. తన దైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరించారు.  అయితే వృద్ధాప్య సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలతో ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయారు.  ఇప్పుడు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు. 2019లో వచ్చిన ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు గంగవ్వ. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజరాజ చోరా’, ‘లవ్ స్టోరీ’, ‘ఇంటింటి రామాయణం’,’ కిస్మత్’, ‘భరతనాట్యం’ తదితర సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సిక్స్త్ సెన్స్ లాంటి టీవీ షోల్లోనూ సందడి చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గంగవ్వ తన జీవితం గురించి ఎవరకీ తెలియని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా తన పిల్లల గురించి ప్రశ్నించగా గంగవ్వ ఇలా సమాధానం చెప్పుకొచ్చింది.. ‘ నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయాను. ఇక ఒంటరిగానే ఆ నరక జీవితాన్ని కొనసాగించాను. ఇక పెళ్లయ్యాక మళ్లీ పిల్లల విషయంలో ఇద్దరిని కోల్పోయాను.ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.. చిన్న వయసులోనే ఒక అబ్బాయి, అమ్మాయి చనిపోయారు. అమ్మాయికి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి ఆమె కూడా చనిపోయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గంగవ్వ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అందరినీ నవ్వించే గంగవ్వ జీవితలో ఇన్ని కష్టలున్నాయా? అంటూ నిట్టూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పికిల్ బాల్ గేమ్ ఆడుతోన్న గంగవ్వ.. వీడియో..

కాగా 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ‘ఉత్తమ పాత్రికేయురాలి’గా ‘తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళ’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. దీంతో పాటు మరెన్నో అవార్డులు, ప్రశంసలు కూడా గంగవ్వకు అందాయి.

 బిగ్ బాస్ సొహైల్ తో  గంగవ్వ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్