OTT Movie: ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఈ సినిమా చూస్తూ 80మందికి పైగా చనిపోయారట!
హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఒంటరిగా చూసేందుకు జంకుతుంటారు. అయితే ఈ సినిమా హారర్ థ్రిల్లర్లలో ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ అట. ఈ భయంకరమైన సినిమాను చూసే చూటప్పుడు దాదాపు 80మందికి పైగా ఆడియెన్స్ చనిపోయారట.

హారర్ థ్రిల్లర్ సినిమాలకు భయమే ప్రధాన ఆయుధం. ఆడియెన్స్ ను ఎంత భయపెడితే సినిమా అంతా సక్సెస్ అయినట్లు. అయితే దీనినే కొందరు దర్శక నిర్మాతలు ప్రచారాస్త్రంగా వాడుకుంటారు. ఆ మధ్యన ఆర్జీవీ లాంటి సంచలన దర్శకులు దమ్ముంటే తమ సినిమాలను థియేటర్లలో ఒంటరిగా చూడండి’ అని ఆడియెన్స్ కు సవాలు విసరడం తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ హారర్ మూవీని చూడాలంటేనే జనాలు వణికిపోయారట. ఎంతలా అంటే ఈ సినిమాను చూస్తూ దాదాపు 86 మంది భయంతో చనిపోయారట. ఒక ప్రమాదకరమైన సినిమా అని, దీనిని చూసిన వారికి ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయని అప్పట్లో అందరూ భయపడ్డారు. అయితే సినిమా గుర్తింపు కోసమే ఇలా ప్రచారం చేశారని టాక్ కూడా ఉంది.ఇందులో ఎంత నిజముందో, అబద్ధముందో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం హారర్ థ్రిల్లర్లలో నెక్ట్స్ లెవల్.
సినిమా కథ విషయానికి వస్తే.. మాక్సిన్ అనే మహిళకి ఒరలీ అనే కూతురు, నాథన్ అనే కొడుకు ఉంటారు. ఒక రోజు వీళ్ల పెట్ డాగ్ చనిపోతుంది. దీంతో నాథన్ తీవ్ర దుఃఖంలో ఉంటాడు. చనిపోయిన కుక్క స్వర్గానికి వెళ్లలేదని, నరకానికి వెళ్లిందని నాథన్ తో అతని తల్లి ఆటపట్టించడానికి చెబుతుంది. దీంతో నాథన్ నొచ్చుకుంటాడు. దీంతో తన సోదరుడిని బుజ్జగించేందుకు ఒరలీ తన తమ్ముడిని అడవిలోని ‘అంట్రమ్’ అనే ప్రాంతానికి తీసుకెళుతుంది. అక్కడ పెంపుడు కుక్క ఆత్మకు శాంతి కలగజేసేందుకు, నరకానికి ఒక గొయ్యి తవ్వాలనుకుంటారు. అయితే వారు లోతుగా తవ్వుతున్న కొద్దీ వింత సంఘటనలు సంభవిస్తాయి. దెయ్యాల రూపంలో కొన్ని వికృత ఆకారాలు పిల్లలను భయపెడతాయి. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోతుంది. మరి ఈ దుష్టశక్తుల నుంచి పిల్లలు తప్పించుకున్నారా? కుక్క ఆత్మ నిజంగానే నరకానికి వెళ్లిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
ఈ కెనడియన్ హారర్ మూవీ పేరు ‘అంట్రమ్: ది డెడ్లీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్’. 2018 లో వచ్చిన ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదలైంది. ఈ మూవీకి డేవిడ్ అమిటో, మైఖేల్ లైసిని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ముందే చెప్పాం కదా.. ఈ సినిమాను ధైర్యమున్నవాళ్లే చూడండి. ఇక పిల్లలకు చూపించకపోవడమే మంచిది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








