Tollywood: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఊరుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు.. వీడియో చూస్తే వావ్ అంటారు
ఈ స్టార్ హీరోయిన్ వయసు నాలుగు పదులకు పైగానే ఉంటుంది. అయితేనేం అందం, అభినయంలో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అవకాశాల్లోనూ ముందుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ హీరోయిన్ పేరుతో ఏకంగా ఒక ఊరే వెలసింది.

మన దేశంలో స్టార్ నటులు, క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ మరెక్కడా కనిపించదు. వారిని ఒక్కసారి అభిమానిస్తే చాలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అందుకే పుట్టిన రోజు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో తమ అభిమాన నటీనటులపై తమకున్న ప్రేమను చూపించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక కొంత మంది హీరోలు, హీరోయిన్లకు గుడులు కట్టి ఆరాధించిన అభిమానులు కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే దక్షిణాదికి చెందిన ఒక స్టార్ హీరోయిన్ పేరు పైన కూడా ఊరు ఉందని తెలిసి ఇప్పుడూ అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఒక అభిమాని స్వయంగా ఆ ఊరికి వెళ్లి వీడియోను చిత్రీ కరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ వీడియో చూసిన సదరు స్టార్ హీరోయిన్ కూడా అభిమాని వీడియోకు లైక్ కొట్టింది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమె పేరు ఉన్న ఊరు ఎక్కడుందో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం రండి.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. సుమారు గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినిమాను ఏలుతోందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ చిరంజీవి, విజయ్ దళపతి, కమల్ హాసన్, సూర్య వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోందంటే ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 42 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు కునుకు లేకుండా చేస్తోన్న ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష.
వీడియో..
Place: TRISHA @trishtrashers Thalaivi name iruku 🥹❤️#Trisha #Vijay #AK connecting name VIJAYAK pic.twitter.com/lNpMfSrImC
— Mr.Dheva (@Mendheva25) May 27, 2025
ఇక త్రిష పేరుతో ఒక ఊరు ఎక్కడ ఉందనేగా మీ ప్రశ్న. ఇది కూడా మన దేశంలోనే ఉంది. లడఖ్ లోని నుబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అయినటువంటి సియాచిన్ బేస్ క్యాంపు కి వెళ్లే మార్గమధ్యంలో Vijayak Trisha అనే ఊరు ఉంది. ఇటీవల అటు వైపు వెళ్లిన ఓ త్రిష అభిమాని ఆ ఊరి బోర్డు ముందు నిల్చొని ఓ వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన త్రిష కూడా వీడియోకు లైక్ కొట్టడం విశేషం. కాగా ఈ నేమ్ బోర్డులో త్రిష పేరుతో పాటు విజయ్ కూడా పేరు ఉండడం గమనార్హం.
View this post on Instagram








