Tollywood: ‘ఆర్మీ ట్రైనింగ్‌ను, క్రికెట్‌ను మధ్యలో వదిలేశాను’.. పశ్చాత్తాపపడుతోన్న టాలీవుడ్ యాంకర్.. ఎవరంటే?
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడీ టాలీవుడ్ యాక్టర్. అందుకు తగ్గట్టుగానే ఉన్నత చదువులు అభ్యసించి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లాడు. అక్కడి ఎగ్జామ్‌లో పాసై, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి ఎట్టకేలకు అకాడమీలో చేరాడు.. కానీ..

పై ఫొటోలో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. అభిమాన గణం కూడా ఎక్కువే. ఇతని మాటలు, డైలాగులు, మ్యానరిజయ్ కు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఎక్కువగా బుల్లితెరపై కనిపించే ఇతను అప్పుడప్పుడూ వెండితెరపైనా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రాములతో బిజి బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాంకర్. అయితే ఈ టాలీవుడ్ స్టార్ యాంకర్ ఆర్మీ ఆఫీసర్ అవ్వాల్సిందట. అందుకోసం చిన్నప్పటి నుంచే కలలు కన్నాడట. తన కలను సాకరం చేసుకునే క్రమంలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుకున్నాడు. అన్నీ పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తి చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. కానీ కొన్ని నిర్ణయాలతో ట్రైనింగ్ ను మధ్యలోనే వదిలేసి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టాడు. అయితే ‘ఆర్మీ ట్రైనింగ్ ను మధ్యలోనే వదిలిపెట్టడం నేను చేసిన పెద్ద తప్పు. ఇది నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం’ అంటూ పశ్చాత్తాపపడుతున్నాడీ స్టార్ యాంకర్. ఒక వేళ ఆర్మీ ఆఫీసర్ అయ్యి ఉంటే తన జీవిత మరోలా ఉండేదేమోనంటోన్న ఆ యాంకర్ మరెవరో కాదు రవి.
తాజాగా ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చాడు రవి. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ చిన్నప్పటి నుంచి నేషన్ ఫస్ట్, ఇండియా అని నాన్న నాకు బాగా ఎక్కించారు. దీంతో నేను కూడా పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నా. ఇంటర్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అప్లై చేశాను. అక్కడ ఎగ్జామ్, ఇంటర్వ్యూ క్లియర్ చేసి అకాడమీలోకి ఎంటర్ అయ్యాను. పూణేలో ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్లాను. అక్కడ జ్వరం వచ్చినా పట్టించుకోరు. ఒక రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మా నానమ్మ, మా అమ్మ చూపించిన ప్రేమకు నేను ఏడ్చేశాను. ఇంక ఆర్మీకి వెళ్ళను అని గట్టిగా చెప్పా. మా నాన్న డబ్బులు కట్టేసా అని చెప్పినా వినలేదు. జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆర్మీ శిక్షణను మధ్యలో వదిలేయడమే! అప్పుడు ఆర్మీకి వెళ్లిపోయుంటే లైఫ్ మరోలా ఉండేది. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటాను’ అని రవి చెప్పుకొచ్చాడు.
ఆహా టాక్ షోలో యాంకర్ రవి, తేజస్విని,
View this post on Instagram








