Balakrishna: బాలయ్య పక్కన నటించి.. ఆఖరికి ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓ వైపు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన ఆయన సినిమాల్లోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నారు బాలయ్య.

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు ఎంతో మంది హీరోలు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే ఎన్టీఆర్ తర్వాత హీరోగా ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నది బాలయ్య ఒక్కరే. ఈ ఏడాది డాకు మహారాజ్ తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన ఇప్పుడు అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అందులో ఒక హీరోయిన్ మాత్రం.. తనకు దగ్గరి బంధువు అవుతుంది. ఒకప్పుడు బాలయ్యతో కలిసి నటించిన హీరోయిన్ ఆ తర్వాత అదే బాలకృష్ణకు వరుసకు కోడలు అయ్యింది. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.
అప్పట్లో బాలకృష్ణ- విజయశాంతిలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ లాంటి హిట్ సినిమాలు వీరి కాంబోలో చ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. విజయశాంతి.. 1988లో ఎమ్వీ శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆయనకు బాలకృష్ణకు మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. బాలయ్యకు, శ్రీనివాస్ ప్రసాద్ వరుసకు కొడుకు అవుతాడు. బాలకృష్ణ పెద్దబావ గణేష్ రావుకు శ్రీనివాస్ స్వయానా మేనల్లుడు. ఈయనకు బాలయ్యకు మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఆ ఫ్రెండ్ షిప్‌తోనే బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలని.. యువరత్న ఆర్ట్స్ స్థాపించి నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లారు ప్రసాద్. అలా వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి బంధంగా మారింది. అలా విజయశాంతితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వరుసకు ఆమెకు మావయ్య అయ్యారు.
భర్తతో విజయశాంతి..

Vijayashanti








