AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ఎప్పుడూ దానికి భయపడలేదు.. అది కూడా ఓ ఆనందమే: కంగనా రనౌత్

ఇప్పుడు హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకుంటున్నారు. అంతే కాదు కొంతమంది హీరోయిన్స్ అవ్వకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కున్న తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు.

నేను ఎప్పుడూ దానికి భయపడలేదు.. అది కూడా ఓ ఆనందమే:  కంగనా రనౌత్
Kangana Ranaut
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2025 | 2:55 PM

Share

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా ఎన్నో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కాంట్రవర్సీల్లో కంగనా పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఎన్నికల్లో విజయం సంధించిన కంగనా ఎంపీ అయ్యింది. మొన్నామధ్య ఎమర్జన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ చిత్రానికి ముందు కంగనా రనౌత్ నటించిన ‘తేజస్’ 2023లో విడుదలైంది. కానీ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. కాగా 2022లో విడుదలైన ‘ధకడ్’ ఫ్లాప్ అయింది. నిజానికి గత ఐదు కంగనా సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. ఇందులో ‘తలైవి’, ‘పంగా’, ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమాలు ఉన్నాయి. అయితే కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె నటనకు స్వస్తి చెబుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కంగనా బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె గెలుపొందింది. ఇప్పుడు ఆమె త్వరలో ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కనిపించనుంది. సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన పనులకు కూడా ఫుల్ టైమ్ కేటాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నటనను వదిలేస్తుందా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజగా కంగనా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా కంగనా వయసు గురించి మాట్లాడింది.

నేనెప్పుడూ వయసు గురించి ఆలోచించలేదు. ఆధ్యాత్మిక భావన నిండిన నా నా మనసు వయసు గురించి ఎప్పుడూ భయపడలేదు. సినిమా ఇండస్ట్రీలో తెల్ల జుట్టు చూసి భయపడేవారిని చూశాను. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. వయసు పెరగడం కూడా ఓ ఆనందమే.. రాజకీయాల్లో వయసు పైబడిన వారి పై దయతో ఉంటారు అని నేను అనుకుంటున్నా.. అని కంగనా తెలిపింది. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే