AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి తన ఫ్రెండ్స్ తో కలిసి గచ్చి బౌలిలోని ఓ పబ్ కు వెళ్లిందీ టాలీవుడ్ నటి. అయితే అక్కడ బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులు,ఈ టాలీవుడ్ నటికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 31, 2025 | 5:43 PM

Share

ఆరెంజ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. హీరోకు సిస్టర్ గా, ఫ్రెండ్ గా, అక్కగా, వదినగా ఇలా పలు సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకుంది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అదే సమయంలో పలు వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ కమెడియన్ పై సంచలన ఆరోపణలు చేసిందీ అందాల తార. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ అందాల తార తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. తన బర్త్ డే పార్టీ సందర్భంగా గచ్చి బౌలి లోని ఓ పబ్ కు వెళ్లిందీ ముద్దుగుమ్మ. అయితే బర్త్ డే కేక్ విషయమై పబ్ సిబ్బంది, నటికి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. చివరకు ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నటి పై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఆమె ఒక డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే పబ్ యజమాన్యం, ఇతరులు కలగజేసుకుని ఇద్దరినీ శాంతింపజేసినట్లు తెలుస్తోంది. అయితే పబ్ సిబ్బంది దాడి చేయడంపై సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పబ్ తీరును ఎండగడుతూ నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.

ఇలా పుట్టిన రోజు వివాదంలో ఇరుక్కున్న ఆ నటి మరెవరో కాదు కల్పికా గణేష్. ప్రయాణం, ఆరెంజ్, నమో వెంకటేశ, జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడి పడి లేచే మనసు, హిట్ ది ఫస్ట్ కేస్, యశోద తదతర తెలుగు సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిందీ అందాల తార. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ మధ్యన ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది కల్పికా గణేష్. దీనికి అభినవ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అప్పట్లో టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

పబ్ నిర్వాహకులతో మాట్లా డుతోన్న నటి కల్పిక..

View this post on Instagram

A post shared by iamkalpika (@iamkalpika27)

View this post on Instagram

A post shared by @kalpikaji143

ఇవి కూడా చదవండి..

Akhil Akkineni: అక్కినేని ఇంట మరో శుభకార్యం.. అఖిల్- జైనాబ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వేదిక ఎక్కడంటే?

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Pavala Shyamala: ‘సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు.. ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’.. దీన స్థితిలో పావలా శ్యామల