AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: 96 సీక్వెల్ నుంచి విజయ్ సేతుపతి ఔట్! లైన్‌లోకి ఆ ట్రెండింగ్ హీరో!

విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో విడుదలైన '96' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇందులోని అద్బుతమైన ప్రేమకథ, పాటలు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అయితే ఇందులో విజయ్ సేతుపతి స్థానంలో కొత్త హీరో వస్తాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Vijay Sethupathi: 96 సీక్వెల్ నుంచి విజయ్ సేతుపతి ఔట్! లైన్‌లోకి ఆ ట్రెండింగ్ హీరో!
Vijay Sethupathi
Basha Shek
|

Updated on: May 31, 2025 | 5:08 PM

Share

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ’96’ భారీ విజయాన్ని సాధించింది. ఇద్దరు మాజీ ప్రేమికులు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం, తమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం.. ఇలా ఈ సినిమా అందరి మనస్సులను కదిలించింది. ఈ చిత్రంలోని పాటలు మరియు నేపథ్య సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. జాను పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక్కడ కూడా ఈ ప్రేమకథ సూపర్ హిట్ అయ్యింది. ఇక కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ చేయగా అక్కడ కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల రానుంది. ’96’ సినిమా రెండవ భాగం తమిళంలో వస్తోంది, ఇది మొదటి సినిమా కథకు కొనసాగింపు కాదు. ఇది వేరే కథ, కానీ రెండు సినిమాల ఇతివృత్తం ఒకటే అవుతుంది. ’96’ రెండవ భాగంలో కూడా విడిపోయిన ప్రేమికుల కథే ఉంటుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి స్థానంలో కొత్త కథానాయకుడిని ఎంపిక చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కొత్త తరం అభిమాన కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ ’96’ సీక్వెల్ లో కథానాయకుడిగా ఎంపికయ్యారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ’96’ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని కూడా పంచుకున్నారు. ‘ నేను ప్రదీప్ రంగనాథన్ ని సంప్రదించిన మాట నిజమే. కానీ అది వేరే సినిమా కోసం. ’96-2′ సినిమాకి ప్రదీప్ తో ఎలాంటి సంబంధం లేదు. ’96’ సినిమాలో నటించిన నటీనటులే ’96 సీక్వెల్ లో కూడా ఉంటారు. ఈ సినిమా కథ పూర్తయిందని, వీలైనంత త్వరగా అధికారికంగా ఇతర వివరాలు ప్రకటిస్తాం’ అని దర్శకుడు పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది ఫేక్ న్యూస్..

మరోవైపు విజయ్ సేతుపతి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘ట్రైన్’, ‘తలైవియన్ తలైవి’, ‘మహారాజా 2’ తదితర సినిమాలతో బిజీగా ఉన్నాడు మక్కల్ సెల్వన్. త్రిష చేతిలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 96 సీక్వెల్‌ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

Akhil Akkineni: అక్కినేని ఇంట మరో శుభకార్యం.. అఖిల్- జైనాబ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వేదిక ఎక్కడంటే?

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Pavala Shyamala: ‘సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు.. ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’.. దీన స్థితిలో పావలా శ్యామల

Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే