AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిలీజ్‌కు ముందు భారీ హైప్.. విడుదలయ్యాక అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం ట్రెండింగ్

ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రిలీజ్‌కు ముందు భారీ హైప్.. విడుదలయ్యాక అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం ట్రెండింగ్
Movie
Rajeev Rayala
|

Updated on: May 31, 2025 | 5:47 PM

Share

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది.

థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది ఆ సినిమా.. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొచ్చాడియాన్: ది లెజెండ్. ఈ సినిమా ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. 2014లో విడుదలైన ఈ సినిమా. సినీ చరిత్రలో తొలి ఫోటోరియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా విడుదలైంది. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలైన అవతార్, టిన్ టిన్ లాంటి టెక్నాలజీని ఉపయోగించారు, ఇది భారతీయ సినిమాలో మొదటిసారి. నటులు మోషన్ క్యాప్చర్ సూట్స్ ధరించి నటించారు, వారి కదలికలు 3D యానిమేషన్‌గా మార్చారు. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. దాదాపు రూ.95 కోట్ల నుంచి రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. దాదాపు 11 ఏళ్లుగా ఈ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జీతం ఎలా ఖర్చు పెట్టాలి? బెస్ట్ ఫార్ములా ఇదే..
జీతం ఎలా ఖర్చు పెట్టాలి? బెస్ట్ ఫార్ములా ఇదే..