Shah Rukh Khan : ఏంటీ.. షారుఖ్ ఖాన్ హైదరబాద్ కుర్రాడా.. ? టోలిచౌకి నుంచి బాలీవుడ్ బాద్ షా వరకు.. ఆసక్తికర విషయాలు..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో ప్రేమకథలు.. మరెన్నో యాక్షన్ చిత్రాలు, ఫ్యామిలీ అడియన్స్ మెచ్చే సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు. ప్రపంచంలోని స్టార్ హీరోస్ అందరిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈరోజు షారుఖ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు హైదరాబాద్ నగరంతో ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.

బాలీవుడ్ సూపర్‌స్టార్, గ్లోబల్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగుతోపాటు యావత్ వరల్డ్ వైడ్ అతడికి స్పెషల్ క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కింగ్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతీ విషయం తెలుసుకోవడానికి ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఈరోజు (నవంబర్ 2న) బాలీవుడ్ బాద్షా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్‌కు ‘సిటీ ఆఫ్ నిజామ్స్’ అయిన హైదరాబాద్ నగరంతో ఒక విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తనను తాను ‘సగం హైదరాబాదీ’ అని తరచూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఇందుకు గల కారణమేంటో తెలుసుకుందామా.. ?
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
షారుఖ్ ఖాన్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె ప్రముఖ సోషల్ వర్కర్, నగరానికి చెందిన సీనియర్ ప్రభుత్వ ఇంజనీర్ కుమార్తె. షారుఖ్ ఖాన్ తన బాల్యంలో కొంత సమయం అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌లోనే గడిపారు. ఓ సందర్భంలో తన గతం గురించి షారుఖ్ మాట్లాడుతూ.. “మా అమ్మ వాళ్ళ ఇంట్లో మగ సంతానం లేకపోవడంతో నన్ను అమ్మమ్మ దత్తత తీసుకున్నారు. ఆ సమయంలో మేము హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో నివసించాము. నా జీవితంలో సుమారు 4 సంవత్సరాలు ఇక్కడే గడిచాయి. ఆ తర్వాత మేము బెంగళూరుకు మారాము. మా అమ్మకు నేను చాలా గుర్తొచ్చాను. అందుకే ఆమె తన తల్లి దగ్గర నుండి నన్ను తిరిగి తీసుకుని, మేము ఢిల్లీకి వచ్చేశాము. మా అమ్మ గారి ఇల్లు హైదరాబాద్‌లోనే ఉంది. మా అమ్మ తరఫు కుటుంబం మొత్తం ఇక్కడే నివసిస్తుంది” అని పంచుకున్నారు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
మరి టోలిచౌకిలో షారుఖ్ ఖాన్ నివసించిన ఇల్లు ఎక్కడ ఉందనే దానిపై ఎప్పుడూ ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ప్రముఖ మీడియా నివేదికల ప్రకారం, షారుఖ్ ఖాన్ తాతగారైన ఇఫ్తికార్ అహ్మద్‌కు టోలిచౌకి మెయిన్ రోడ్డు ప్రాంతంలో ఒక విశాలమైన ‘హవెలీ’ (భారీ భవనం) ఉండేది. కాలక్రమేణా ఆ స్థలాన్ని విక్రయించడంతో, ప్రస్తుతం అక్కడ ప్రముఖ ‘మఘల్ రెసిడెన్సీ’ అపార్ట్‌మెంట్ వెలిసింది. టోలిచౌకిలోని ఈ చారిత్రక ప్రాంతంతో షారుఖ్ ఖాన్‌కు ఉన్న బాల్య జ్ఞాపకాలు ఆయన అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తన తల్లి వేర్లు ఉన్న ఈ నగరంతో ఉన్న మమకారాన్ని షారుఖ్ ఎప్పుడూ మరువలేరని చెప్పవచ్చు. ప్రస్తుతం షారుఖ్ కింగ్ చిత్రంలో నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
