Kamal Haasan: కమల్ హాసన్‌కు తన పుస్తకాలను బహుమతిగా ఇచ్చిన కన్నడ నటి.. ఎందుకో తెలుసా?
'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి నటి రంజని రాఘవన్ తన కన్నడ పుస్తకాలను కమల్ కు బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లోక నాయకుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై కన్నడిగుల ఆగ్రహం చల్లారడం లేదు. ‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అన్న కమల్ కామెంట్స్ కన్నడిగులకు బాగా కోపం తెప్పించింది. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. తనకు క్షమాపణ చెప్పే ఉద్దేశం లేదని కమల్ హాసన్ అన్నారు. అందువలన, అతని చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉండగా, చాలా మంది ప్రముఖులు కమల్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు చేస్తున్నారు దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కొందరు కమల్ మాటలను తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారు.
అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ కన్నడ నటి, దర్శకురాలు, కథా రచయిత్రి రంజని రాఘవన్ తాను రాసిన పుస్తకాలను కమల్ హాసన్ కు బహుమతిగా ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ పుస్తకాలన్నీ కన్నడ భాషలోనే ఉన్నాయి. రంజని తాను రాసిన ‘కథ డబ్బీ’, ‘స్వైప్ రైట్’ పుస్తకాలను కమల్ హాసన్ కు బహుమతిగా ఇచ్చింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘కమల్ సర్ కోసం ఒక కన్నడ పుస్తకం’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది రంజని. అయితే రజనీ ఈ పుస్తకాలు కమల్ కు ఎందుకిచ్చారో ఎవరికీ అంతు పట్టడం లేదు. అందులోనూ కన్నడ వర్సెస్ కమల్ వివాదం కొనసాగుతున్న వేళ ఆమె ఇలా తన కన్నడ పుస్తకాలను కమల్ కు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది కమల్ సార్ కు కౌంటరా? లేదా ఆయనపై ఉన్న అభిమానమా? అంటూ చాలా మంది నెటిజన్లు సమాధానాలు సంధిస్తున్నారు.
కమల్ తో కన్నడ నటి..
View this post on Instagram
‘కన్నడతి’ వంటి సీరియల్స్ ద్వారా రంజని దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె ఒక సినిమా కూడా తీసింది. ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగుపెట్టారు. ‘డీ డీ ధిక్కి’ అనే చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.








