Kamal Haasan: మీ తప్పుకు పోలీసులు భద్రత కల్పించాలా..? కమల్‌కు చివాట్లు పెట్టిన హైకోర్టు..
కర్ణాటకలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిదే. కమల్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పేంతవరకు సినిమాను రిలీజ్ కానివ్వమంటూ కన్నడిగులు హెచ్చరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన కమల్ కు కోర్టు చివాట్లు పెట్టింది. క్షమాపణ చెప్పకుండానే పోలీసు రక్షణ కోరడాన్ని కోర్టు ఖండించింది.

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమా వివాదంలో చిక్కున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఈ సినిమాపై ఇప్పటికే నిషేదం విధించారు. తమ హెచ్చరికలు కాదని ఎవరైనా సినిమా ప్రదర్శిస్తే థియేటర్లు కాల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని వాదిస్తున్నారు కమల్. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. తన సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ కమల్ హైకోర్టును ఆశ్రయించారు. థగ్ లైఫ్ సినిమా విడుదలకు భద్రత కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్ట్ సింగిల్ జడ్జి బెంచ్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కమల్ హాసన్‌ను తీవ్రంగా విమర్శించింది.
కమల్ హాసన్ న్యాయవాదులకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు గడువు ఇచ్చి, వారి వైఖరిని తెలియజేయాలని కోర్టు కోరింది. “మీరేమైనా చరిత్రకారుడా లేదా భాష పండితుడా ? కన్నడ అనేది తమిళం నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు ? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి. సమస్య పరిష్కరమవుతుంది. మీ వాణిజ్య ప్రయోజనాల కోసం సినిమా తీశారు. ఇప్పుడు మీ తప్పుకు పోలీసులు రక్షణ కల్పించాలా.. ?” అంటూ జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం కమల్ న్యాయవాది ధ్యాన్ చిన్నప్పను ప్రశ్నించింది.
” మీ ప్రకటన శివరాజ్ కుమార్ కు సమస్య తెచ్చిపెట్టింది. మీరు మీ ప్రకటనను ఖండించలేదు, అంగీకరించారు. కానీ మీరు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారా? ఇది రూ. 300 కోట్ల విలువైన సినిమా అని మీరు చెబుతున్నారు. అప్పుడు క్షమాపణ చెప్పండి.. ఎలాంటి సమస్య ఉండదు”అని కోర్టు అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..




