అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోయిన అలీ- జుబేదా
మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే నటుల్లో ప్రముఖ కమెడియన్ అలీ ఒకరు. అందుకే అలీకి ఏటా వేసవిలో మామిడి పండ్లను పంపిస్తారట చిరు. అలా ఈసారి కూడా తన ఫామ్‌హౌస్‌లో పండిన మామిడి పండ్లను అలీకి పంపించారు చిరంజీవి. అవి చూసి అలీ దంపతులు మురిసిపోయారు. అయితే ఈసారి మామిడి పండ్లతో పాటు మరికొన్ని బహుమతులు కూడా పంపించారు చిరు.
అవే అత్తమ్మాస్ కిచెన్ వంటకాలు..! ఎస్ !అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్ తదితర రెడీ టు మిక్స్ పొడులను అలీ దంపతులకు పంపించారు చిరంజీవి- సురేఖ. వీటిని సెపరేట్ గా ప్యాక్ చేసి మరీ అలీ ఇంటికి పంపారు మెగాస్టార్. వీటిని చూసి అలీతో పాటు ఆయన భార్య జుబేదా తెగ సంబరపడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అన్న తమకోసం వీటిని ప్రేమగా పంపారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ స్టార్ కపుల్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసనతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరిట గతేడాది ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అప్పటికప్పుడు ఈజీగా వంటలు చేసుకునేలా రెడీ టు మిక్స్ పొడులను ఈ అత్తా కోడళ్లు విక్రయిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఆవకాయ పచ్చడిని కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కూడా అత్తమ్మాస్ కిచెన్ అవకాయ పచ్చడిని పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్షమించమంటూ.. నానికి ట్వీట్ చేసిన సూర్య
గద్దర్ అవార్డు విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఒక్కొక్కరికి ఎంత రానుందంటే ??
దీపికను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్! ఆగం ఆగం చేస్తున్నారుగా

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
