క్షమించమంటూ.. నానికి ట్వీట్ చేసిన సూర్య
ఒకప్పుడు డైరెక్టర్‌గా.. ఇప్పుడు యాక్టర్‌గా.. తనేంటో నిరూపించుకున్న ఎస్ జే సూర్య.. ఉన్నట్టుండి నాచురల్ స్టార్ నానికి క్షమాపణలు చెబూతూ ట్వీట్ చేశారు. అంతేకాదు సారీ చెబుతూనే.. తన ట్వీట్‌లో నానిని ఆకాశానికెత్తేశారు సూర్య. ఎట్ ప్రజెంట్ తమిళంతో పాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్న సూర్య... నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీలో తనదైన స్టైల్‌లో విలనిజం పండించాడు.
అవినీతిపరుడైన పోలీస్ అధికారి దయా పాత్రలో అందరినీ భయపెట్టాడు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పడిదే పాత్రకు గాను మరో గొప్ప గుర్తింపు దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు ఎస్ జే సూర్య. ఇందుకు గానూ హీరో నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా సూర్యకు అభినందనలు తెలియజేశాడు. ‘కంగ్రాట్స్ సర్. మీరు ఈ సినిమాకి కేవలం సహాయ నటుడు మాత్రమే కాదు. మీరు అన్నీ. ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు’ అని సూర్యపై ప్రశంసలు కురిపించాడు నాని. అయితే ఆ సమయంలో సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఎస్ జే సూర్య ‘థ్యాంక్స్ అంటూ కేవలం ఒక్క మాటలో రిప్లై ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఇది సరైన పద్ధతి కాదని రియలైజ్ అయిన ఎస్.జె. సూర్య శనివారం నానీకి క్షమాపణలు చెపుతూ మరో ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గద్దర్ అవార్డు విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఒక్కొక్కరికి ఎంత రానుందంటే ??
దీపికను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్! ఆగం ఆగం చేస్తున్నారుగా
ఓటీటీలు గట్రా లేవ్.. నా సినిమాను నేరుగా యాట్యూబ్‌లో వేస్తా
నల్లని ఒత్తయిన జుట్టు కోసం.. ఇదొక్కటి చాలు
పొలానికి వెళ్లిన అతని ఫేట్ తిరిగిపోయింది.. ఒక్కరాయి జీవితాన్నే మార్చేసింది
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

