పొలానికి వెళ్లిన అతని ఫేట్ తిరిగిపోయింది.. ఒక్కరాయి జీవితాన్నే మార్చేసింది
వర్షాకాలం మొదలైందంటే అక్కడి జనాలంతా పొలాలకు పరుగులు పెడతారు. పంటలు పండించేందుకు కాదు.. రాళ్లు ఏరుకునేందుకు.. అవును.. రాళ్లంటే మామూలు రాళ్లు కాదు.. వజ్రాల రాళ్లు... వర్షాకాలం మొదలైంది.. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జనం తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు.
తాజాగా మద్దికెర మండలం పెరవలి కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ వద్ద నివాసం ఉండే.. ఓ వ్యక్తి పంట పండింది. ఆదివారం పొలంలో వెతకగా.. ఏకంగా రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికిందని సమాచారం. ఆ ప్రాంతానికే వచ్చి ఓ వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారట. మార్కెట్‌లో ఆ వజ్రం విలువ రూ.60 లక్షల దాకా ఉంటుందని చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ.. పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఉప్పు అందడంతో ఆరా తీస్తున్నారు. ఇటీవల పెరవలిలో కూడా ఒకరికి వజ్రం దొరికగా.. దానిని రూ.1.5 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. వజ్రాలు వేట సాగించేవారికి.. దాని విలువ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఒకవేళ ఉన్నా ఎక్కువసేపు దాన్ని తమ వద్ద ఉంచుకోరు. పోలీసు వారికి తెలిస్తే అది స్వాధీనం చేసుకుంటారనే భయంతో వెంటనే దాన్ని అమ్మేస్తూ ఉంటారు. అందుకే విక్రయాలు రహస్యంగా సాగుతాయి. వ్యాపారులు అయితే అక్కడే మకాం వేసి.. పొలాల వద్ద వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం జనం కర్నూలు పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు. వజ్రం దొరికితే జీవితం మారిపోతుందని ఆశపడుతూ ఉంటారు. అక్కడే నివాసం ఉండటం, వండుకోవడం చేస్తూ రోజుల తరబడి వజ్రాల అన్వేషణలో మునిగిపోతూ ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదలరు!
బెడ్‌పై నిద్రపోతుండగా.. యువకుడి పైకి పాకుతూ వచ్చిన రాచనాగు.. కట్ చేస్తే

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
