Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదలరు!

ఈ పండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదలరు!

Phani CH

|

Updated on: Jun 02, 2025 | 6:42 PM

రోజూ ఒక యాపిల్‌ పండు తింటే డాక్టర్‌తో పనుండదంటారు. ఒక్క యాపిల్‌ మాత్రమే కాదండోయ్‌ అలాంటి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పండ్లు ఇంకా ఉన్నాయి. వాటిలో ఒకటి..వాటర్‌ యాపిల్‌.. చూశారా ఇందులో కూడా యాపిల్‌ ఉంది. అవును మరి యాపిల్‌ అంటే ఆరోగ్యానికి పెట్టింది పేరు. ఈ వాటర్‌ యాపిల్‌ కూడా యాపిల్‌తో సమానమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు కలిగి ఉంది.

వీటిని కొందరు గులాబ్‌జామూన్ అని, ఇంకొందరు జంబోరాపండు అని అంటారు. కానీ వాటర్‌ యాపిల్‌గానే ఇది ఎక్కువ ప్రసిద్దికెక్కింది. వాటర్‌ యాపిల్‌ తినటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు ఎ, బి1, బి3, సి, క్యాల్షియం, ఐరన్, పీచు, సల్ఫర్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం అందుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒంట్లో చేరిన హానికరమైన పదార్థాలను బయటకు పంపుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడొచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. జుట్టు రాలకుండా, కుదుళ్లు దృఢంగా ఉంటాయి. జుట్టు త్వరగా తెల్లబడకుండానూ అడ్డుకుంటుంది. చర్మ సంరక్షణకు మహబాగా పనిచేస్తుంది. అంతేకాదు, గుండెజబ్బులను నిరోధిస్తుంది. జీర్ణప్రక్రియ బాగుంటుంది. ఊబకాయం రాదు. మధుమేహాన్ని అడ్డుకుంటుంది. డీ-హైడ్రేషన్‌ సమస్య ఏర్పడదు. కాలేయ సమస్యలు నయమవుతాయి. గర్భిణీలు వీటిని తినటం వల్ల పోషకాలు అందుతాయి. శరీరంలో అసౌకర్యంగా అనిపించే లక్షణాలు తగ్గి.. సౌఖ్యంగా ఉంటుంది. వీటితో జ్యూస్, సలాడ్, జామ్, పచ్చడి కూడా చేయొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెడ్‌పై నిద్రపోతుండగా.. యువకుడి పైకి పాకుతూ వచ్చిన రాచనాగు.. కట్ చేస్తే

వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్‌.. చిరుతలతో కలిసిమెలిసి