బెడ్‌పై నిద్రపోతుండగా.. యువకుడి పైకి పాకుతూ వచ్చిన రాచనాగు.. కట్ చేస్తే
వేసవికాలం మొదలైందంటే చాలు.. గ్రామాలలో ఇళ్లల్లోకి ప్రవేశించి గది మూలలు, సోఫాలు, బెడ్‌లు, టాయిలెట్ వంటి ప్రదేశాల్లో తలదాచుకుంటాయి పాములు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో అదే జరిగింది. తెల్లటి చారలు ఉన్న నల్లటి రాచనాగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. మంచం పక్కనే దుస్తులు, దుప్పట్లు, ఫ్యాన్ వంటివి ఉన్నాయి.
వాటన్నింటినీ దాటుకొని మెల్లిగా యువకుడు పడుకున్న బెడ్‌పైకి ఎక్కిన రాచనాగు, అతను కప్పుకొన్న దుప్పటిపై నుంచి, నడుము భాగానికి ఆ తర్వాత కాళ్లపై నుంచి, చేతుల మీదుగా పాకుతూ వెళ్లింది. ఆ అలికిడికి ఆ యువకుడు నిద్ర లేచాడు. అయితే సడెన్‌గా పైకి లేస్తే ఎక్కడ కాటు వేస్తుందేమో అని భయపడ్డ యువకుడు శరీరాన్ని కదిలించకుండా అలాగే స్థానువులా పడుకున్నాడు. పాము అతనిపై నుంచి వెళ్లిపోయే వరకు కదలకుండా నక్కి పడుకున్నాడు. వీడియో తీస్తూ వచ్చాడు. పాము అతన్ని దాటిపోయాక లేచి చూశాడు. చూడ్డానికే ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అత్యంత విషపూరిత పాముల్లో రాచనాగు ఒకటి. అది కాటు వేసిందంటే జీవితంపై ఆశలు వదులుకోవలసిందే. అసలే వేసవికాలం. ఇళ్లల్లోకి వచ్చే పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
