Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్‌.. చిరుతలతో కలిసిమెలిసి

వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్‌.. చిరుతలతో కలిసిమెలిసి

Phani CH

|

Updated on: Jun 02, 2025 | 6:26 PM

ఇటీవల కాలంలో క్రూరమృగాలు జనావాసాల్లోకి చొరబడటం.. మనుషులు, పశువులపై దాడులకు పాల్పడటం చూస్తున్నాం. సాధారణంగా పులి, చిరుతపులి పేరు చెబితేనే భయంతో వణుకు పుడుతుంది. పక్క గ్రామంలో పులి సంచరిస్తుందంటే.. చట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో కంటిమీద కునుకు తియ్యరు. అలాంటిది ఓ గ్రామంలో ఏకంగా చిరుతపులులను పెంపుడు జంతువులుగా భావించి వాటితో కలిసిమెలిసి జీవిస్తారు.

విచిత్రమేంటంటే.. ఆ చిరుతలు అక్కడి ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టవు.. అక్కడి ప్రజలకు చిరుతలంటే ప్రాణం.. వాటికి తమ రక్షకులుగా భావిస్తారు. ఒక్కోసారి చిరుతలు తమ పశువులపై దాడిచేసి తినేసినా వాటికి ఎలాంటి హానీ చెయ్యరు. వాటిపట్ల ఎంతో దయతో వ్యవహరిస్తారు. ఆ గ్రామం ఎక్కడో కాదు మన భారత్‌లోనే రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉంది. ఆ గ్రామం పేరు జవాయి బేరా గ్రామం. పాలి జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న జవాయి బేరా గ్రామంలో సుమారు 70 నుంచి 100 చిరుతపులులు నివసిస్తున్నాయి. బెరా గ్రామం రాతి కొండలు, ఎత్తయిన పొదలతో కూడిన అడవులు, గడ్డి భూములతో నిండి ఉంటుంది. ఈ గ్రామంలో చిరుతపులులు మనుషులతో కలిసి స్వేచ్ఛగా సంచరిస్తాయి. గ్రామస్తులు చిరుత పులులకు భయపడకుండా తమ రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ గ్రామంలో చిరుతల ఆవాసానికి అనువైన వాతావరణ పరిస్థితులుండటంతో అవి ఇక్కడ ఎక్కువగా నివసిస్తాయి. ఇదే బేరా గ్రామాన్ని భారతదేశ చిత్రపటంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. బేరా గ్రామంలో నివసించే ప్రజలను రబారీ తెగగా వ్యవహరిస్తారు. వీరు తమని తాము ఈ చిరుతలకు రక్షకులుగా భావిస్తారు. వాటిని ఎంతో గౌరవిస్తారు.. ప్రేమిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరెప్పుడైనా టీని ఇలా వడపోశారా ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

సముద్ర గర్భంలో వింత జీవి రహస్యాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

చీకటిలోనూ చూసేలా చేసే ఐ డ్రాప్స్‌! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

పొలాలను వదిలి.. చెంగు చెంగున ఎగురుతూ చెరువుల్లోకి చేపలు

కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం.. ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా