మీరెప్పుడైనా టీని ఇలా వడపోశారా ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చాలామందికి టీతోనే రోజు మొదలవుతుంది. ఇక మన దేశం లో టీ ప్రియులు కోట్లలో ఉంటారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా రకరకాల టీలు తయారు చేస్తుంటారు. కొందరు అల్లం చాయ్, మసాలా టీ, బెల్లం టీ ఇలా ఎన్నో వెరైటీ టేస్టులతో చాయ్ తయారు చేస్తుంటారు. పాలు, పంచదార, టీ పౌడర్‌తో పాటుగా ఇతర మసాలాలు కూడా టీ తయారీ కోసం వాడుతుంటారు.
ఇక చాయ్ రెడీ అయ్యాక దాన్ని ఫిల్టర్ చేసి తాగుతుంటారు. టీ ఫిల్టర్ అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి చేసిన జుగాడ్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. టీ జల్లెడ లేకుండా అతడు టీ వడకట్టిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో కామెంట్లు చేశారు. ఒక వ్యక్తి అందరూ చేసినట్టే టీ తయారు చేశాడు. పాలు, చక్కెర, టీ ఆకులు వేసి బాగా మరిగించి చాయ్ తయారు చేశాడు. దానిని వడపోసి తాగుదామంటే అతని వద్ద టీ జల్లెడ లేదు. దాంతో అతనికి ఓ ఐడియా వచ్చింది. చుట్టు పక్కల ఉన్నఎండిపోయిన మొక్కలను సేకరించాడు. వాటన్నింటిని దగ్గరగా పేర్చి నెట్‌లా తయారు చేసి పట్టుకున్నాడు. అలా ఎండిన కొమ్మల మీదుగా టీని వడగట్టి పోసుకున్నాడు. అలా టీలోని ఆకులు, యాలకులు, టీ పౌడర్ అంతా ఆ ఎండిన కొమ్మలపై ఉండిపోగా.. టీ కింద గిన్నెలో పడింది. అంతే ఎంచక్కా దాన్ని కప్పులో వేసుకొని తాగేశాడు. ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. టీ ఇలా కూడా వడపోయొచ్చాఅని అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ఐడియాలు ఇండియాదాటి వెళ్లకూడదు సుమీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను లక్షన్నరమందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర గర్భంలో వింత జీవి రహస్యాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు
చీకటిలోనూ చూసేలా చేసే ఐ డ్రాప్స్! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
పొలాలను వదిలి.. చెంగు చెంగున ఎగురుతూ చెరువుల్లోకి చేపలు
కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం.. ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా
కలెక్టర్ కొలువు వదిలిపెట్టి.. సినిమాల్లోకి వచ్చి.. శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
