కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం.. ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా
ఓ కారు డ్రైవర్ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే దిమ్మదిరిగే షాకిచ్చాడు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చేశాడు. అవును, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కారు డ్రైవర్ గా పనిచేసే అతను ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీచేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేశాడు. అతనికి వేలాది రూపాయల సమర్పించుకొని మోసపోయామని గుర్తించిన బాధితులు అసలు కథ బయటపెట్టడంతో ఆ కేటుగాడి బాగోతం బయటపడింది.
అతన్ని అరెస్టుచేసిన పోలీసులు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, సర్వీస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మంద కళ్యాణ్ అనేవ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.. తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సంపాదించిన ఈవ్యక్తి జల్సాలకు అలవాటు పడి కొత్త తరహా మోసాల తెరలేపాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసంచేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సుమారుగా 40 మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి డబ్బులు వసూలు చేశాడు. కొందరికి వరంగల్ జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీచేసి కలెక్టర్ పేరుతో ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశాడు. ఆ పత్రాలతో ఉద్యోగంలో చేరడానికి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసింది. దీంతో లబోదిబోమంటూ బాధితులు జిల్లా కలెక్టర్ వద్దకు పరుగెత్తారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్ డ్రైవర్ కళ్యాణ్, భవ్య కిరణ్, వంశీ అనే మరో ఇద్దరితో కలిసి ఇంత భారీ స్కెచ్ నడిపించాడని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. 40 మంది నుండి ఇప్పటివరకు 16 లక్షల 14 వేల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు. మంద కళ్యాణ్ ను అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు అతని వద్ద 23 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, 39 సర్వీస్ బుక్స్, నకిలీ ఉద్యోగ నియామక పత్రాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఒక కారు సీజ్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మంద కళ్యాణ్ పై కఠినచర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలెక్టర్ కొలువు వదిలిపెట్టి.. సినిమాల్లోకి వచ్చి.. శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ
పాకిస్తాన్‌తో సన్నీ యాదవ్‌కు లింకేంటి ?? NIA అదుపులో తెలుగు యూట్యూబర్
పవన్ సైగతో తనిఖీలు.. వణికిపోతున్న థియేటర్ల ఓనర్లు
అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. అన్నకు చేసినట్టే.. సేమ్ అదే మాదిరి!

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
