పవన్ సైగతో తనిఖీలు.. వణికిపోతున్న థియేటర్ల ఓనర్లు
ప్రస్తుతం సినిమా థియేటర్ సీనే మారిపోయింది. స్క్రీన్ దగ్గర్నుంచి స్నాక్స్ వరకూ అంతా ఛేంజ్ అయ్యింది...! సినిమా టికెట్ కంటే తినుబండారాల ధరలే ప్రేక్షకుడిని దబిడిదిబిడి చేస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లోని క్యాంటీన్లలో స్నాక్స్ ధరలు స్నేక్స్‌లా బుసకొడుతున్నాయి. వాటర్ బాటిల్ దగ్గర్నుంచి పాప్‌కార్న్‌దాకా బాదుడే బాదుడు అన్న కాన్సెప్ట్ కంటిన్యూ అవుతోంది.
ఆఖరికి పార్కింగ్ ఫీజుతోనూ ప్రేక్షకుడిని పరేషాన్ చేస్తున్నారు. ఇక ధరల సంగతి సరే… క్వాలిటీ మెయింటేన్ చేస్తున్నారా…? శుభ్రంగానే స్నాక్స్ తయారుచేస్తున్నారా…? అసలు క్యాంటీన్లు ఎలా ఉన్నాయ్…? థియేటర్‌లో వసతుల కల్పన మంచిగానే ఉందా…? సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా…? వంటి విషయాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు అధికారులు. సినిమా థియేటర్లలో ఫుడ్ స్టాల్స్‌పై అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. థియేటర్ ఇన్‌సైడ్ ఫుడ్ ధరలు, అవుట్ సైడ్ ఫుడ్ ధరలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. సినిమా టికెట్ కంటే ఫుడ్ ఖర్చే ఎక్కువ అవుతుందంటూ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే అంటున్నారు జనం. బయట 20 రూపాయలు పలికే ఎగ్ పఫ్ థియేటర్‌లో 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. బయట 20 రూపాయలకు లభించే వాటర్ బాటిల్ థియేటర్ లోపల 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. థియేటర్‌లో కూల్ డ్రింక్ కొనాలంటే నోరెళ్లబెట్టాల్సిందే. కోక్ టిన్ వంద రూపాయలు. ఇక పాప్ కార్న్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిదే. థియేటర్‌లో పాప్ కార్న్ శ్రీమంతులే కొంటారన్నట్లుగా మండిపోతున్నాయి ధరలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. అన్నకు చేసినట్టే.. సేమ్ అదే మాదిరి!

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
