అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. అన్నకు చేసినట్టే.. సేమ్ అదే మాదిరి!
అక్కినేని నాగార్జున ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. జైనాబ్ రవ్డీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. నాగ చైతన్య వివాహం జరిగిక కొన్ని రోజులకే అఖిల్ అక్కినేని నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ తో అఖిల్ ఉంగరాలు మార్చుకున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇప్పుడీ ప్రేమ జంట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 6న అఖిల్- జైనాబ్ ల వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత ఈ జంట పలుమార్లు కలిసి కనిపించింది. అలాగే కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవ శరీర భాగాలు .. బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు..
పసిపిక్ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?
సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో
కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్‌కు తనేంటో చూపించేందుకు రెడీ!
ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..
ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..
లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్.. అంతలోనే
ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా

