ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం
అను అగర్వాల్! సినీరంగంలో 1990లలో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసింది. కానీ వ్యక్తిగత కారణాలతో కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాల నుంచి తప్పుకుంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
దీంతో జ్ఞాపకశక్తి కోల్పోయి కొన్నాళ్లు కోమాలోనే ఉండిపోయింది. ఆ తర్వాత సన్యాసిగా మారింది. 1990లో వచ్చిన ఆషికి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అను అగర్వాల్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. మహేష్ భట్ తెరకెక్కించిన ఆషికీ సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమా అప్పట్లో రాహుల్, అనులకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కాజోల్, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోహీరోయిన్లతోపాటు అను అగర్వాల్‌కు మంచి క్రేజ్ వచ్చింది. కానీ 1999లో జరిగిన ఓ ప్రమాదంతో ఆమె దాదాపు 29 రోజులు కోమాలో ఉండిపోయింది. ఆ తర్వాత తన జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆషికీ సినిమా చూస్తూ తనకు ఏం గుర్తులేదని చెప్పుకొచ్చింది. 2001లో సన్యాసిగా జీవించాలనుకుని పర్వతాలకు వెళ్లిపోయింది. కొన్నేళ్లు అక్కడే గడిపిన ఆమె తిరిగి ముంబై వచ్చేసింది. ఇప్పుడు యోగా సాధన చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్యాన్ అలా పిలిచే సరికి.. సిగ్గుతో మొగ్గలేసిన రష్మిక
హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా.. సీక్రెట్ చెప్పేసిన సుకుమార్
1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
